వైసీపీ ఓటమిని పసిగట్టేశారు.. అధికారులు తప్పులు దిద్దుకునే పనిలో పడ్డారు!

అమరావతికి మంచి రోజులు వస్తున్నాయి. మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటుందన్న నమ్మకం పెరుగుతోంది. మే 13న ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సరళి చూసిన తరువాత అందిరిలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతే కాదు సీఆర్డీయే అధికారుల తీరులోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. చేసిన తప్పులు దిద్దుకునే పనిలో పడ్డారు. ఇన్నాళ్లు జగన్ ఆడమన్నట్లల్లా ఆడి అమరావతిని నిర్వీర్యం చేయడంలో తమ వంతు పాత్ర పోషించిన అధికారులు ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారు. 

అమరావతి నిర్మాణం కోసం తెచ్చిన సామగ్రిని కాంట్రాక్టర్లు ఇతర ప్రాంతాలకు వాటిని తరలించుకుపోతుంటే.. దగ్గరుండి మరీ సాగనంపిన సీఆర్డీయే తీరులో మార్పు వస్తున్నది. ఔను ఎన్నికలకు ముందు నుంచి అమరావతి నుంచి సామాగ్రి తరలించడం అన్నది ఒక యుద్ధ ప్రాతిపదికన సాగిందా అన్నట్లుగా జరిగింది.

ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందన్న విషయంలో ఒక స్పష్టతకు వచ్చిన అధికారులు ఒక్క సారిగా అలర్ట్ అయ్యారు.  తరలింపు నిలిపివేయాల్సిందిగా కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అంతే కాదు తరలించిన సామగ్రినీ వెనక్కు తీసుకురావలని హుకుం జారీ చేశారు. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో భాగంగా బెంగాల్ లో ఉన్న సీఆర్డీయే కమిషనర్ వివేక్ యాదవ్ అక్కడి నుంచే ఈ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి వీవేక్ యాదవ్ అమరావతి నిర్వీర్యం చేసు విషయంలో జగన్ ఆదేశాల మేరకు అత్యంత కీలకంగా వ్యవహరించారు.  అమరావతిలో రోడ్లను తవ్వి తీసుకుపోతున్నా ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ప్రభుత్వ మార్పుపై ఒక స్పష్టత రావడంతో  ఆయన తప్పులు దిద్దుకునే పనిలో పడినట్లు కనిపిస్తోంది.  

Teluguone gnews banner