పోస్టల్ బ్యాలెట్టే ఫలితం చెప్పేసింది! వైనాట్ తెలుగుదేశం విన్ 175!!
posted on May 25, 2024 @ 10:57AM
ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. జూన్ 4వ తేదీన ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 38 వేల 865 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా రెండో స్థానంలో నంద్యాల జిల్లా నిలిచింది. ఇక్కడ 25 వేల 283 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పడ్డాయి.
ఆ తరువాతి కడప జిల్లా 24 వేల 918 పోస్టల్ బ్యాలెట్లు పపోలయ్యాయి. ఇక అత్యల్పంగా నరసాపురంలో 15 వేల 320 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలోనూ సగటున తక్కువలో తక్కువ 3 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ వివరాలు పూర్తిగా రావడంతో ఏ జిల్లాలో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలి..? ఒక్కో టేబుల్‌లో ఎన్ని లెక్కించాలని అనే అంశంపై రిట ర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాచారం ఇచ్చింది. ఇలా ఉండగా పోస్టల్ ఓట్ల లెక్కింపు విషయంలో ఒకింత వివాదం తలెత్తింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేని ఓట్లు లెక్కించాలా వద్దా అన్నదానిపై మీమాసం నెలకొంది.
అయితే గెజిటెడ్ ఆఫీసర్ సతకం చేసిన సీల్ లేకపోయినా పోస్టల్ ఓట్లను పరిగణనలోనికి తీసుకోవాలని తెలుగుదేశం కూటమి గట్టిగా పట్టుబట్టింది. ఇందుకు ఎన్నికల కమిషన్ మౌఖికంగా అంగీకారం కూడా తెలిపింది. అయితే ఆ అంగీకారం రాతపూర్వకంగా కావాలని తెలుగుదేశం కూటమి పట్టుబడుతోంది. వాస్తవానికి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్ దేనని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. గెజిటెడ్ ఆఫీసర్ ద్వారానే పోస్టల్ బ్యాలెట్ విడుదల అవుతుంది, ఆయన ఇవ్వకుండా ఎవరికీ పోస్టల్ బ్యాలెట్ అందే అవకాశమే లేదనీ అంటున్నారు. ఆ కారణంగానే సంతకం సీల్ వంటి టెక్నికాలిటీస్ తో సంబంధం లేకుండా పోలైన ఓట్లన్నీ లెక్కించాలని తెలుగుదేశం కూటమి డిమాండ్ చేస్తోంది.
అదలా ఉంచితే.. ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందో పోలైన పోస్టల్ ఓట్లను బట్టి చెప్పే యవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఏపీ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా భారీగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఒటు హక్కు వినియోగించుకున్నారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరులో నియోజకవర్గానికి సగటున మూడు వేలకు పైగా పోలైన ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. అధికార పార్టీయే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు వినియోగించుకున్న ఓటు కచ్చితంగా తమకు వ్యతిరేకంగానే అని నమ్ముతోంది. ఆ లెక్కన చూస్తే రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనూ కూడా వైసీపీ గట్టెక్కే పరిస్థితి లేదన్న భావన ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతోంది.
అదే సమయంలో నెటిజనులు భారీగా పోలైన పోస్టల్ ఓట్లను ఉటంకిస్తూ.. జగన్ చెప్పిన వైనాట్ 175 రివర్స్ అవుతుందేమో అంటున్నారు. వారు జగన్ వైనాట్ 175 అని వైసీపీ గెలిచే సీట్ల గురించి మాట్లాడితే.. ఇప్పుడు అది రివర్స్ అయినట్లు కనిపిస్తోందనీ, వైనాట్ తెలుగుదేశం విన్ 175 అన్నట్లుగా పరిస్థితి ఉందనీ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఓ రేంజ్ లో వైసీపీని ట్రోల్ చేస్తున్నారు.