ట్వీట్ల పోరులో గెలిచిన ట్రాఫిక్ పోలీసు!
posted on Oct 22, 2022 @ 12:29PM
కాలేజీకి వెళ్లే అమ్మాయి చెవి రింగులా ఫోన్ పెట్టుకుని ఇంటి నుంచి క్లాసులోకి వెళ్లేంతవరకూ చాటింగ్ చేస్తూనే ఉంది..ఏమంత బిజీ చాట్ ఉంటుందే అనుకుంది తల్లి. అదే ప్రశ్న ఆ తల్లి తన తల్లినీ అడిగిం ది. ఏమో చదువుకంటే సెల్ గోలే ఎక్కువయిందని విసుక్కుంది. యువతకు అదో సరదా, అదో ఆనం దం. ట్రాఫిక్ పోలీసులకు కెమెరాలిచ్చి, చలాన్లు రాయమన్న కొత్త ఉద్యోగం కల్పించి వారికి మాత్రం సరదా ఎలా ఉన్నా తలభారమూ ఎక్కువ చేశారు. కెమెరా కన్నేసుకుని ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర కాస్తంత దూరంలో చెట్టు దగ్గరో, హోటల్ దగ్గరో నిలబడతాడు.. బాండ్‌లా! సర్రున ఓ కుర్రాడో, ఉద్యోగో బైక్ మీద వెళి పోతా డు. ఈ మహానుభావుడు కన్ను తెరిచి క్లిక్ మనిపించాడో.. ఆ కుర్రాడికి, ఉద్యోగికి మూడిందే! చలాన్లు పంపడంలో ఉండే ఆసక్తి సరిగా పంపిస్తున్నామన్నదీ చాలాసార్లు పట్టించుకోవడం లేదు. సదరు చలానా కట్టే వ్యక్తి తిట్టిపోస్తుంటాడు! వాళ్ల చలాన్ల మెసేజ్‌ల గోల నెటిజన్లకు చిరాగ్గానూ మారుతోంది.
ఆమద్య కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఒక యువకుడు హెల్మెట్ లేకుండా బైక్‌పై దూసుకుపోతున్న ఫొటోను అతడికి పంపిన ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. అయితే, ఆ ఫొటోలో నంబరు ప్లేట్ మాత్రమే కనిపిస్తుండడంతో అతడు సోషల్ మీడియాకెక్కాడు. ట్రాఫిక్ పోలీసులు పంపిన ఫొటోలో తాను హెల్మెట్ ధరించలేదని చెప్పడానికి ఎలాంటి ఆధారమూ లేదని, కాబట్టి తాను జరిమానా చెల్లించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. గతంలోనూ ఇలానే పంపితే పోనీలే అని జరిమానా చెల్లించానని, ఈసారి మాత్రం చెల్లించేది లేదన్నాడు. పూర్తి ఫొటో అయినా పంపాలని, లేదంటే కేసును అయినా వెనక్కి తీసుకోవాలని సూచించాడు.
ఈ ట్వీట్ చూసిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే పూర్తి ఫొటో పంపడంతో యువకుడు కంగుతిన్నాడు. ఇది చూసిన యువకుడు పూర్తి ఫొటో పంపినందుకు ధన్యవాదాలు చెబుతూ.. జరిమానా చెల్లిస్తానని పేర్కొ న్నాడు. ఓ పౌరుడిగా తెలుసుకునే హక్కు ఉండడం వల్లే ప్రశ్నించానని అన్నాడు. ఆ తర్వాత తొలుత చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. పోలీసులు, యువకుడు మధ్య జరిగిన ట్వీట్ల పోరుపై నెటిజన్లు స్పం దించారు. అతడు హెల్మెట్ పెట్టుకోకపోవడమే కాకుండా ఇయర్ ఫోన్స్ ధరించి ఉన్నాడని, కాబట్టి మరింత ఎక్కువ ఫైన్ వేయాలని సూచించారు. పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేసినందుకు అతడిపై ఇంకా జరిమానా వేసే అవకాశం ఉంటే పరిశీలించాలని మరికొందరు కామెంట్ చేశారు.