స్టాలిన్ ఆదర్శం.. జగన్ శిరోభారం!
posted on Oct 22, 2022 @ 11:51AM
నాయకుడు ప్రజల్లోంచి రావాలంటారు. ప్రజాభిమానం పొందినవాడే నిజమైన నాయకుడనిపించు కుం టాడు. ప్రజాసంక్షేమం కోరేవాడే నిజమైన రాజకీయనాయకుడు, అలాంటివారినే ముఖ్యమంత్రిగానూ ప్రజ లు కోరుకుంటారు. స్టాలిన్ నాయకుడు, ప్రజాసంక్షేమాన్ని నిత్యం ఆశిస్తున్నారు గనుకనే ఆయనకు తమిళనాట బ్రహ్మరథంపడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయినా తాను ప్రజాసేవకుడినే అని ప్రకటించుకున్న నాయకుడు స్టాలిన్. ఆయన కోవిడ్ సమయంలో తమిళనాడులో ప్రజల సంక్షేమాన్ని ఆశించి ఆయన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశమంతా గుర్తించింది.
నిత్యం తన వాహనంలో సెక్యూరిటీ రక్షణ వలయంలో కార్యాలయా నికి వెళు తూండటం మామూలే. కానీ అలా వెళుతూనే ప్రజలు పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు కూడా పట్టించు కోవడం కొందరే చేయగల్గు తారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అలాంటివారు. మొన్న తన కార్యాల యానికి వెళుతూండగా హఠాత్తుగా ఒక వ్యక్తి బైక్ మీద వెళుతూ కిందపడిపోయాడు. అది గమనించిన స్టాలిన్ వెంటనే తన వాహ నం దిగి ఆ వ్యక్తి వద్దకు వెళ్లారు. పోలీసులు పరుగున చేరుకున్నారు. తలకు దెబ్బతగిలిన ఆ వ్యక్తిని ఆటోలో ఎక్కించి ఆస్ప త్రికి తరలించేలా చూశారు. ఆ గాయపడిన వ్యక్తితో పాటు సహాయంగా ఉండమని ఒక సెక్యూరిటీ గార్డును కూడా ఆస్పత్రికి పంపించారు. యువ ముఖ్యమంత్రి నేటితరం నాయకుడు అందరినీ ఆదుకోవడంలో, మంచి పథకాలతో అందరి మన్ననలు పొంది, మంచి ముఖ్యమంత్రి అని పించుకుంటాడా అనే అనుమా నాలు తొలినాళ్లలో వచ్చిన ప్పటికీ విమర్శ కుల మాటలకు ప్రజాసేవతో సమాధానం చెపుతూ న్నారు, స్టాలిన్.
చిత్రమేమంటే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కూడా యువకుడే. యువనేతగానే అందరి మాటా వింటూ, సం క్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజారంజకంగా తన తండ్రిలానే పరిపాలన సాగిస్తాడని అంతా ఆశించా రు. కానీ మూడేళ్లకే జగన్ ప్రజాదరణ కోల్పోయి అసలు సీఎం పీఠానికే తగనివాడిగా గుర్తింపు పొందడం గమనార్హం. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజాసంక్షేమాన్ని ఆశిస్తూ సాగిస్తున్న పాలన తో పోలిస్తే జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. జగన్ను ఏ విధంగానూ స్టాలిన్‌తో సరిసమానంగా ఊహించని స్థాయికి దిగజారాడన్నది తెలిసిన అంశమే.
ప్రజాదరణ కోల్పోయి, తను నమ్మినవారికి ద్రోహం చేయడం, ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వది లేసి తన పార్టీవారిని ఆదేశాలతో ఆందోళనకు గురి చేయడం తప్ప చేస్తున్నదేమీ లేదని ప్రజలే అంటు న్నారు. మూడేళ్ల పాలనను పరిశీలిస్తే విపక్షాల మీద విరుచుకు పడటం తప్ప, ప్రజోపయోగంగా చేసిన దేమీ కనపడదు. ప్రజలు కూడా ప్రధాన విపక్షం టీడీపీ యే మళ్లీ అధికా రంలోకి రావాలని కోరుకోవడము, వారికి బ్రహ్మరథం పట్టడమే జగన్ సర్కార్ పరిస్థితిని స్పష్టం చేస్తోంది. ఎక్కడ స్టాలిన్.. ఎక్కడ జగన్ అనుకుంటున్నారు. ఇది జగన్ సర్కార్ స్వయంకృతం. తమిళ నాట యువ ముఖ్యమంత్రి ని ప్రజలు నెత్తినపెట్టుకుంటే, తెలుగునాట జగన్ ను నెత్తి బరువుగా భావించి దించేసుకుం టున్నారు.