కొత్త అల్లుడిలా తీసుకువచ్చి.. పంపించేశారా?
posted on Dec 24, 2021 @ 3:56PM
అధికారంలో మన పార్టీ ఉంటే.. మనం ఏమైనా చేయొచ్చు.. ఎలాంటి పనైనా చేయొచ్చు. ఎవరినైనా తిట్ట వచ్చు.. ఎవరినైనా ఇరగ్గొటైయోచ్చు. అందుకు సాక్ష్యాలు కళ్ల ముందు కనబడుతున్నా... తూతూ మంత్రంగా ఇలా కేసు బుక్ చేసి.. అలా అరెస్ట్ చేసి.. ఆ వెంటనే బెయిల్ ఇచ్చి.. పెళ్లైన కొత్తలో అత్తగారింటికీ అలా కొత్త అల్లుడిని తీసుకు వచ్చి.. ఇలా సాగనంపినట్లు సాగనంపేయవచ్చు.
ఇది జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతల అనుచరుల చేస్తున్న హల్‌చల్‌పై పోలీసులు వ్యవహారిస్తున్న తీరును రాజకీయ పండితులు ఈ తరహాలో ఎండగడుతున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బారావు గుప్తా కామెంట్లు.. ఆ క్రమంలో సదరు గుప్తాపై మంత్రి బాలినేని వాసన్నకు కుడి భుజం,ఆ పార్టీ మైనారిటీ నాయకుడు, రౌడీ షీటర్ సుబానీ బండ బూతులు తిడుతూ.. దాడి చేయడం.. బాధితుడిని మోకాళ్ల మీద కూర్చో బెట్టి మరీ మంత్రి వాసన్నకు సారీ చెప్పిండం..ఈ మొత్తం వ్యవహారంలో సుభానీ ఎక్కడ తగ్గేదే లే అన్నట్లు వ్యవహరించిన తీరు ప్రపంచమంతా చూసింది.. చూస్తోంది.
కానీ ఇంత చేసిన రౌడీ షీటర్, మంత్రి బాలినేని అనుచరుడు సుభానీని అరెస్ట్ చేయడానికి పోలీసులు సైతం వెనకడుగు వేశారని..ఆ క్రమంలో గుప్తాపై దాడి కారణంగా ఆర్య వైశ్య సంఘం నేతలు ఆందోళనకు దిగి.. సుభానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం... దాంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అప్పటికప్పుడు.. రౌడీ షీటర్ సుభానీని బతిమాలి.. బామాలి పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి.. అరెస్ట్ చేసి.. ఆయనపై ఐపీసీ 448, 427, 32, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే సుబ్బారావు గుప్తాకు సుభానీ ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చాడో వీడియో సాక్ష్యం ఉన్నా... సుభానీపై అటెమ్ట్ టూ మడ్డర్ కేసు నమోదు చేయకుండా .. స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు నమోదు చేయడం ఏమిటని పోలీసులను రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో అంటే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గుంటూరు జిల్లా మాచర్లలో ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే స్థాయి ప్రజా ప్రతినిధిలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అత్యంత దారుణంగా దాడి చేస్తే.. అతడిపై కూడా స్టేషన్ బెయిల్ కేసు నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రాజకీయ పండితులు గుర్తు చేస్తున్నారు. సామాన్యులు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. అర్థరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా ఇళ్లపై దాడి చేసి.. సదరు వ్యక్తులను అరెస్ట్ చేసే ఈ పోలీసులు.. ఇంత దారుణంగా వ్యవహరించిన వారిపై స్టేషన్ బెయిల్ కేసులు నమోదు చేయడం ఏమిటని పోలీసుల తీరును రాజకీయ పండితులు బహిరంగంగా నిలదీస్తున్నారు.
అంటే అదికార పార్టీలో ఉన్న వారికి ఓ విధమైన కేసులు.. ప్రతిపక్షంలో ఉన్న వారిపైన ఓ రకమైన కేసులు నమోదు చేయడం ఆంధ్రప్రదేశ్ పోలీసులకే చెల్లిందనే టాక్ సోషల్ మీడియా సాక్షిగా వైరల్ అవుతున్న విషయాన్ని రాజకీయ పండితులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసుల తీరును ప్రజలు సైతం ఏవగించుకుంటున్నారంటూ నెట్ జన్లు .. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు. నిజాయితీ, వృత్తి పట్ల నిబద్ధత.. ఎంత ఉంది అనేది ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే బయటపడతాయని పోలీసులకు రాజకీయ పండితులు సూచిస్తున్నారు. కానీ ఏపీ పోలీసులు మాత్రం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా పని చేయడం తరహా పద్దతిని ఎప్పుటికి మార్చుకుంటారోనని నెట్‌జన్లు వెయ్యి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నారు.