అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కన్నుమూత
posted on Aug 26, 2012 @ 12:33PM
చంద్రుడిపై కాలు పెట్టిన తొలి మానవుడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కన్నుమూశారు. ఆగస్టు 5న జరిగిన బైపాస్ సర్జరీ అనంతరం తలెత్తిన సమస్యలే మరణానికి కారణం. 1969 జూలై 20న చంద్రునిపై దిగిన అపోలో 11 అంతరిక్ష నౌకకు ఆర్మ్‌స్ట్రాంగ్ కమాండర్‌గా వ్యవహరించారు. చంద్రునిపై పాదం మోపీ మోపగానే, ‘‘ఒక మనిషిగా ఇది చాలా చిన్న అడుగే గానీ మానవాళికి మాత్రం గొప్ప ముందడుగు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయాయి.
సహచరుడు ఎడ్విన్ ఆల్డ్రిన్‌తో కలిసి చంద్రుని ఉపరితలంపై స్ట్రాంగ్ మూడు గంటల పాటు గడిపారు. పరిశోధనలు చేయడం, నమూనాలు సేకరించడం, ఫొటోలు దిగడంతో పాటు గోల్ఫ్ కూడా ఆడారు! చంద్రునిపై మనిషి తొలిసారి కాలు మోపిన ఆ క్షణాలను అప్పట్లోనే 50 కోట్ల మందికి పైగా టీవీలో చూశారు.