Read more!

అలా అయితే రాజీనామా చేస్త.. స్పీకర్ పోచారం సంచలనం

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన దళిత బంధు పథకం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కొత్త పథకాల పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడుతున్నాయి. విపక్షాలకు అదే స్థాయిలో కౌంటరిస్తున్నారు గులాబీ లీడర్లు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నారు. 

విపక్షాలపై ఆరోపణలపై స్పందించారు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.  విపక్షాలకు ఓ సవాల్ విసిరారు. దేశంలో ఎక్కడ లేని అభివృద్ధి తెలంగాణలోనే ఉందన్నారు స్పీకర్ పోచారం. అభివృద్ధి చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారని చెప్పారు. తెలంగాణలో ఉన్న అభివృద్ధి వేరే రాష్ట్రం లో ఎక్కడైనా ఉందా.. ఉందని ఎవరైనా చూపిస్తే రాజీనామా చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. తాము ప్రజలనే నమ్ముకున్నామని చెప్పారు,  ఓడించాలన్నా గెలిపించాలన్నా ప్రజల తోనే సాధ్యమన్నారు. గెలుపు ఓటములు మాట్లాడే హక్కు ప్రజలకు మాత్రమే ఉందన్నారు.  నోరు ఉంది కదా మైకు ఉంది కదా అని ఏది పడిత అది  మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు వినడానికి సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.