Read more!

భవానీపూర్ లో మమత పోటీ.. నందిగ్రామ్ సీన్ రిపీటయ్యేనా? 

ఈ సంవత్సరం (2021) ప్రధమార్థంలో జరిగిన  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కానీ, పార్టీ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగాం నియోజక వర్గంలో అంతే ఘనంగా ఓడిపోయారు. అయినా తృణమూల్‌కు మెజార్టీ సీట్లు రావడంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే, ఆరు నెలల్లోగా ఆమె ఉప ఎన్నికలో గెలిచి  ఎమ్మెల్యేగా  సభలో కాలు పెడితేనే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారు, లేదంటే, ఆరు నెలల గడవు ముగిసిన వెంటనే నవంబర్ 5 తర్వాత మాజీగా మిగిలి పోతారు.  ఈ నేపధ్యంలో ఆమె,  ఆరు నెలల గడవులోగా ఎమ్మెల్యేగా ఎన్నికై పదవిలో కొనసాగుతారా లేక మాజీగ మిగిలి పోతారా? అనే విషయంలో ఇంతవరకు ఒక విధమైన సందిగ్దత కొనసాగింది. రాజకీయ, మీడియా వర్గాల్లో రకరకాల చర్చలు జరిగాయి. కరోనాను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల గడవుకు ముందు ఉప ఎన్నికలు జరగకుడా అడ్డుకుంటుందని, ఆమెను మాజీని చేసి మోడీ, షా జోడీ పగ తీర్చుకుంటారని  అందరూ అనుకున్నారు. 

కేంద్ర ప్రభుత్వం అలాంటి అపప్రదకు అవకాశం ఇవ్వలేదు. కేంద్ర ఎన్నికల సంఘం, కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఉప ఎన్నికలు జరగవలసిన అన్ని రాష్ర్ల మలతో పాటుగానే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అభిప్రాయం తీసుకుంది. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేసిన వినతిని ఎన్నికల సంఘం ఆమోదించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి సిద్దం చేసిన, భవానీపుర నియోజక వర్గంతో  పాటుగా, రాష్ట్రంలోని మరో రెండు నియోజక వర్గాలు, ఒడిస్సాలోని పిప్లీ లోక్ సభ నియోజకవర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 
దీంతో ఒక ఉత్కంట తొలిగి పోయింది. మరో వంక భవానీపుర నియోజకవర్గం ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించింది. ఆ విధంగా మమత బెనర్జీకి తప్పదనుకున్న  పదవీ గండం తొలిగి పోయింది. 

అయితే ఇల్లలకగానే పండగ కాదు, ఉప ఎన్నిక జరిగినంత మాత్రాన మమతా బెనర్జీ గెలుస్తారన్న గ్యారెంటీ ఏంటి, అంటే, నిజమే, ఎన్నికలలో గెలుపు ఓటములు అన్ని సందర్భాలలో ఒకేలా ఉండవు. అయితే, భవానీపుర నియోజక వర్గం విషయంలో అలాంటి అనుమానాలు అక్కరలేదని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిలో మమతా బెనర్జీని ఓడించడం బీజేపీకి అయ్యే పని కాదు.బీజేపీలో అసెంబ్లీ ఎన్నికలు ముందున్న జోష ఇప్పుడు లేదు. ఇప్పటికే, ఐదారుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తృణమూల్ పంచన చేరారు. మమతా బెనర్జీ ఒకక్ విజిలేస్తే గోడ దుకేందుకు మరో డజను మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. 
అదలా ఉంటె, భవానీపుర మొదటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట, వరసగా రెండు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ గెలిచారు. ముఖ్యమంత్రి అయ్యారు. 

మొన్నటి ఎన్నికల్లో మాత్రం వ్యూహాత్మక పంతానికి పోయి,ఆమె నందిగ్రాం నుంచి పోటీ చేసి బీజేపీ  అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు.అయినా, భవానీపుర నియోజకవర్గంలో తృణమూల్  పట్టు సడల లేదు. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సోవన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ అంతకు ముందు (2016) అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి వచ్చిన మెజారిటీ కంటే, ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి రెడ్నుసార్లు విజయంసాధించిన మమతా బెనర్జీకి, 2011లో 50 వేల పైచిలుకు మెజారిటీ వచ్చింది. కానీ, 2016లో ఆమె మెజారిటీ సగానికి సగం పది పోయింది.25 వేల మెజారిటీతో  గెలిచారు.కాగా, 2011 ఎన్నికల్లో  తృణమూల్ అభ్యర్ధి సోవన్‌దేవ్‌ ఛటోపాధ్యాయకు 28వేలకు పై చిలుకు మెజారిటీ వచ్చింది. 

ఇక ఇప్పుడు, ఆమె ముఖ్యమంత్రి హోదాలో బరిలో దిగుతున్నారు. కాబట్టి, ఇటు పార్టీ నాయకులు, అటు విశ్లేషకులు కూడా ఆమె గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు, అయితే, రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో,రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం, ఎంతటి రాజకీయ పండితులకు అయినా అన్నిసందర్భాలలో సాధ్యం కాదు. అయితే, ఇది అలాంటి సందర్భమా అంటే కాదు..అనలేము ... అవుననీ అనలేము అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు.