నకిలీ పైలట్ లైసెన్స్‌ల స్కామ్
posted on Mar 26, 2011 @ 11:01AM
న్యూఢిల్లీ: పైలట్ల నకిలీ లైసెన్స్‌ల కుంభకోణంలో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో పౌర విమాన యానాల డైరెక్టరేట్ జనరల్ (డిజిసిఎ) సినియర్ అధికారి ఉన్నాడు. అరెస్టయిన సీనియర్ అధికారి ప్రదీప్ కుమార్ డిజిసిఎలో అదనపు డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అతను పరీక్షల మార్కు షీట్ల ఫోర్జరీకి, ఇతర పత్రాల తారుమారుకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నకిలీ మార్కు షీట్లను కమర్షియల్ పైలట్ లైసెన్స్‌ల పరీక్షలకు ఉపయోగించినట్లు అధికారిక రహస్య సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందుకు ప్రతిగా ప్రవీణ్ కుమార్ పెద్ద యెత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అరెస్టయిన మిగతా ముగ్గురు టూర్ ఆపరేటర్స్. వీరు ప్రవీణ్ కుమార్‌కు సహకరిస్తూ వచ్చారు. అరెస్టయిన ముగ్గురు టూర్ ఆపరేటర్స్‌లో ఇద్దరు లలిత్ పంకజ్, ప్రదీప్. మరో 9 మంది అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను, అచ్చుయంత్రాలను, స్కానర్‌ను స్వాధీనం చేసుకున్నారు.