Read more!

నరకం చూపించే ఫైల్స్ సమస్యకు అసలు కారణాలు ఇవే..!

ఫైల్స్ ను మొలలు అని కూడా అంటారు.  మలద్వారం దగ్గర బొడిపెల్లా  ఏర్పడి మలవిసర్జనకు వెళ్లినప్పుడు ఆటంకం కలిగించే ఈ సమస్య చెప్పడానికి చాలా తేలికగా అనిపిస్తుంది కానీ ఇది అనుభవించే వారికి  నరకం చూపిస్తుంది.  మలవిసర్జన సాఫీగా జరగకపోవడం వల్ల బలవంతంగా ఒత్తిడి కలిగించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒక్కోసారి  మలంతో పాటు రక్తం పడుతూ ఉంటుంది.  ఫైల్స్ సమస్యకు ప్రాధాన కారణంగా మలబద్దకాన్ని చెబుతారు. మలబద్దకం ఉన్నవారిలో ఫైల్స్ వచ్చే సమస్యలు  ఎక్కువ ఉంటాయని  వైద్యులు కూడా చెబుతారు. అయితే అసలు మలబద్దకం సమస్య ఎందుకు వస్తుంది? దీనికి కారణాలు ఏంటి తెలుసుకుంటే మలబద్దకం, ఫైల్స్ రెండింటికి చెక్ పెట్టవచ్చు.

ఎక్కువసేపు కూర్చోవడం..

ఇప్పట్లో చాలావరకు కూర్చుని చేసే పనులే ఉన్నాయి. సిస్టమ్స్ ముందు లేదా షాపులలో కూర్చుని పనిచేయడం అన్నిచోట్లా కనిపిస్తుంది.  గంటల తరబడి ఇలా కూర్చోని పనిచేయడం వల్ల మలబద్దకం, దాని వెంట ఫైల్స్ సమస్య వస్తాయి. అందుకే ఎక్కవసేపు కూర్చోని పనిచేసేవారు కనీసం గంటకు ఒకసారి అయినా కూర్చున్న చోటి నుండి లేచి ఓ 5నిమిషాలు రిలాక్స్ గా నడవాలని  వైద్యులు చెబుతున్నారు.

ధూమపానం, మధ్యపానం..

ఆల్కహాల్ అతిగా తీసుకోవడం, అలాగే ధూమపానం చేయడం వల్ల కూడా ఫైల్స్ సమస్య వస్తుంది. ఇవి జీర్ణక్రియను, ప్రేగుల పనితీరును దెబ్బతీస్తాయి. అందుకే ఈ రెండు అలవాట్లకు దూరంగా ఉండాలి.

నీరు..

ప్రతి రోజూ మనిషికి మూడు నుండి నాలుగు లీటర్ల నీరు లేదా 8గ్లాసుల నీరు అవసరం అవుతుంది. వైద్యులు కూడా తప్పనిసరిగా 8గ్లాసుల నీరు తీసుకోమని చెబుతుంటారు. అయితే  నీరు తక్కువగా తాగితే జీర్ణాశయం, పేగుల పనితీరు దెబ్బతింటుంది. ఇది మలబద్దకం, పైల్స్ సమస్యకు దారితీస్తుంది.

ఒత్తిడి..

ఒత్తిడి వల్ల కూడా ఫైల్స్ సమస్యలు వస్తాయి. శరీరంలో ఒత్తిడి ఫీలవుతుంటే హార్మోన్ల సమస్యల నుండి అవయవాల పనితీరు వరకు అన్ని దెబ్బతింటాయి. గట్టిగా దగ్గడం, ఒత్తిడితో కూడిన పనులు చేయడం వంటివి చేయడం వల్ల మొలల సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. దీన్ని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ చేయాలి.

మాంసాహారం..

మాంసాహారం ఎక్కువ తినేవారిలో ఫైల్స్ సమస్య చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా చికెన్, మటన్, గుడ్లలో పచ్చసొన తొందరగా ఫైల్స్ సమస్య రావడానికి కారణం అవుతుంది. వీటికి బదులు ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం మంచిది.

గర్భం దాల్చినప్పుడు..

గర్భం దాల్చినప్పుడు మలద్వారం ప్రాంతం పైన బిడ్డ ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా గర్భవతులలో ఫైల్స్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.  అయితే ప్రసపం తరువాత ఈ సమస్య తగ్గిపోతుంది.

స్పైసీ ఫుడ్..

కారం, మసాలా ఎక్కువ ఉన్న జంక్ ఫుడ్స్, ఇతర ఆహారాల వల్ల కూడా మొలల సమస్య వస్తుంది. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, బిస్కెట్లు, మైదా ఆధారిత ఆహారాల వల్ల మలబద్దకం సమస్య, దాన్నుండి ఫైల్స్ సమస్య కూడా వస్తుంది.

                                             *నిశ్శబ్ద.