వూహాన్ లో వైరస్.. అమెరికాలో ఫైజర్ ? కరోనా వ్యాప్తి వెనుక వ్యాపార కుట్ర?
posted on Jun 2, 2021 @ 1:06PM
ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి. లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. కోట్లాది మంది వైరస్ భారీన పడ్డారు. చాలా దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. ధనిక రాష్ట్రాలే కరోనా దెబ్బకు అతలాకుతలం కాగా... పేద దేశాలు మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి. చైనాలోని వూహాన్ లో తొలి కేసు నమోదు కాగా... ఆ వైరస్ పుట్టుకపై ఇంకా మిస్టరీ విడటం లేదు. చైనాలోని వూహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ ను కృత్రిమంగా తయారు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు సైంటిస్టులు ఇందుకు సంబంధించిన ఆధారాలు బయటపెడుతున్నారు. కరోనా వైరస్ పుట్టుక వెనుక అమెరికా హస్తం ఉందనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. గతంలో చైనా కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. యూఎస్ ఆర్మీనే వైరస్ ను చైనాకు తీసుకువచ్చిందని ఆరోపించింది. తాజాగా వ్యూహాన్ ల్యాబ్ తో అమెరికా ఫార్మా కంపెనీల లింకులు బయటకి వస్తున్నాయి. దీంతో కరోనా మహమ్మారి వెనుక అగ్రరాజ్యం హస్తం ఉందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.
కరోనా నియంత్రణకు మొదటగా వచ్చిన వ్యాక్సిన్ అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ తయారు చేసింది. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. చైనా వూహాన్ లోని జీవ ప్రయోగశాలకు ఫైజర్ ఫార్మా సంస్థకు సంబంధాలున్నట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. వుహాన్ లోని జీవ ప్రయోగశాల అమెరికన్ కంపెనీ GSK (గ్లాక్సోస్మిత్‌క్లైన్) చెందినది. ఈ GSK సంస్థే అమెరికాలోని ఫైజర్‌ను కొనుగోలు చేసింది. వుహాన్ లోకి లీక్ అయిన వైరస్ కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది ఫైజర్ సంస్థ. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
అంతేకాదు GSK కి బ్లాక్ రాక్ ఫైనాన్సెస్ నిధులు సమకూరుస్తుంది. ఈ బ్లాక్ రాక్ ఫైనాన్స్.. ఓపెన్ ఫౌండేషన్ కంపెనీని నిర్వహిస్తుంది. బ్లాక్ రాక్ ఫైనాన్స్ కు చెందిన సోరోస్ ఫౌండేషన్ కు జర్మన్ సంస్థ వింటర్‌థుర్ లో వాటా ఉంది. ఈ సంస్థ ఎండీ జిన్, వుహాన్‌లో ఒక ప్రయోగశాలను నిర్మించాడు. తర్వాత వూహాన్ లోని ఈ ప్రయోగశాలను జర్మన్ కంపెనీ అల్లియన్స్ కొనుగోలు చేసింది.ఇందులో వాన్గార్డ్ ప్రధాన వాటాదారుడు ఉన్నాడు. అతనే బ్లాక్ రాక్ సంస్థలోనూ కీలక వాటాదారు. ఈ బ్లాక్ రాక్ సంస్థే కేంద్ర బ్యాంకులను నియంత్రిస్తూ.. ప్రపంచ పెట్టుబడి మూలధనంలో మూడింట ఒక వంతును నిర్వహిస్తుంది. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. బ్లాక్ రాక్.. బిల్ గేట్స్ యాజమాన్యంలోని మైక్రోసాఫ్ట్ లో ప్రధాన వాటాదారుగా ఉంది. కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసిన ఫైజర్ లోనూ మైక్రోసాఫ్ట్ సంస్థకు వాటా ఉంది.
వుహాన్ లో వెలుగుచూసిన వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. దీని కట్టడి కోసం మొదటగా ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది. ఫైజర్ వ్యాక్సిన్ చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. టీకాను భద్రపరిచే ఏర్పాట్లను ఫైజర్ అనుబంధ సంస్థ చేస్తుంది. ఫైజర్ యొక్క అనుబంధ సంస్థే వ్యాక్సిన్ రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లకు బాధ్యత వహిస్తుంది. ఫైజర్ కంపెనీ తన వ్యాక్సిన్‌ను అమెరికాలో 1,100 రూపాయలకు, యూరప్‌లో 1,800 రూపాయలకు విక్రయిస్తుంది. దీని ధర భారత్‌కు రూ .2,700. అంటే భారత్ లో 130 కోట్ల మంది, ఒక్కొక్కరికి రెండు డోసుల లెక్క మొత్తం 7 లక్షల కోట్ల రూపాయల మార్కెట్. ఇదంతా గమనిస్తే.. కరోనా వైరస్ వెనుక పెద్ద తతంగమే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక్కడే భారత రాజకీయ నేతల చర్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.ముఖ్యంగా ఫైజర్ టీకాకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం విస్మయపరుస్తోంది. ఫైజర్ సంస్థ రూల్స్ ప్రకారం టీకా వల్ల ఏ భారతీయ పౌరుడైనా నష్టపోతుంటే.. అతను ఫైజర్‌పై కేసు పెట్టలేడు. అందుకే ఈ టీకా అనుమతికి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీన్నే తప్పుపడుతూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇక్కడే అమెరికా మరో కుట్రకు తెర తీసింది. ఫైజర్ ను గుర్తించలేదంటూ.. భారత వ్యాక్సిన్‌కు అవసరమైన ముడి పదార్థాలను అమెరికా ఆపివేసింది. అయితే భారత్ సర్కార్ ఒత్తిడి, అంతర్జాతీయంగా వచ్చిన విమర్శలతో అమెరికా ప్రెసిడెంట్ జోబిడెన్ దిగొచ్చారు. ముడి పదార్థాల ఎగుమతిపై విధించిన నిషేదంపై వెనక్కి తగ్గారు,
ఇక్కడ మరో కీలక అంశం ఉంది. కరోనా థర్డ్ వేవ్ .. చిన్న పిల్లలకు తీవ్ర ప్రభావం చూపుతుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ ప్రచారం ప్రారంభమైన వారంలోనే చిన్న పిల్లల వ్యాక్సిన్ రెడీగా ఉందంటూ ఫైజర్ ప్రకటన చేసింది. చిన్న పిల్లలపై ఎప్పుడు ప్రయోగాలు చేశారు, పరిశోధనలు ఎప్పుడు ముగిశాయి.. థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారం జరిగిన కొన్ని రోజుల్లోనే ఇదంతా ఎలా ముగిసిందన్నది ప్రశ్నగా మారింది. కరోనాపై వరుసగా జరిగిన, జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. అమెరికా ఫార్మా కంపెనీల పెద్ద కుట్ర బయటికి వస్తోందని తెలుస్తోంది. ఒక అజ్ఞాన వైరస్ సృష్టించడం, ప్రజలలో వ్యాప్తి చేయడం, వారిని WHO లాగా మాట్లాడటం, మార్కెట్ టీకాలు వేయడం, భారీ మొత్తంలో డబ్బు సంపాదించడం లక్ష్యంగా అమెరికా కంపెనీలు కుట్రలు చేశాయనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఇటీవలే అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ మాస్క్ లేకుండా బయటికి వచ్చారు. రెండు టీకాలు వేసుకున్న వారు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఇదంతా అమెరికా వ్యాపార కుట్రలో భాగంగానే జరిగిందని భావిస్తున్నారు. ఇంత జరగుతున్నా ఫైజర్ సంస్థ కోసం రాహుల్ భారత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం.. మేధావిగా గుర్తింపు ఉన్న మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడకపోవడం అన్ని అమెరికా కుట్రలో భాగమేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాని మోడీ.. డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా వ్యవహించారనే ప్రచారం ఉంది. అందుకే మోడీ సర్కార్ పై కోపంతో జోబిడెన్... ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. అయితే భారత్ టార్గెట్ గా అమెరికా చేస్తున్న కుట్రలకు.. మనదేశ ప్రతిపక్ష పార్టీనే మద్దతుగా నిలవడం నిజంగా దేశానికి దౌర్భాగ్యమే...