ఆకాశంలో అద్భుతం.. ఇంద్రధనస్సు సోయగం..
posted on Jun 2, 2021 @ 1:35PM
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్యుని చుట్టూ సప్తవర్ణ శోభితం వెల్లివిరిసింది. నింగిలో ఇంద్రధనస్సు కనువిందు చేసింది.
వారెవా.. రెయిన్‌బో.. కనులారా చూసి తీరాల్సిందే.. సూర్యుని చుట్టూ రంగులతో సర్కిల్స్ వేసినట్టు.. ఎంచక్కా ఉంది..
ఈ ఉదయం వర్షం కురవడంతో.. హైదరాబాద్ తో పాటు.. కర్నూలు, కడప ప్రాంతాలలో దాదాపు రెండు గంటలపాటు ఈ ఇంద్రధనస్సు కనిపించింది.. చూపరులను మంత్రముగ్థులను చేసింది..
సూర్యుడు ప్రకాశవంతంగా వెలిగిపోతుంటే.. దాని చుట్టూ సప్తవర్ణాలు వలయాకారంలో మెరిసిపోతూ కనిపించాయి..
గాలిలో చిన్నచిన్న నీటి స్ఫటికాలు ఉంటాయి. అవి కాంతిని వక్రీకరిస్తాయి. తెల్లని కాంతిని ఏడు వర్ణాలుగా విభజించి ప్రతిబింబిస్తాయి. ఇదే.. ఈ వృత్తాకార ఇంద్రధనస్సు.
గత వారం బెంగళూరులోనూ ఇటువంటి దృశ్యం కనిపించింది. తాజాగా, హైదరాబాద్‌లో ఈ వృత్తాకార ఇంద్రధనస్సు.. ఆకాశంలో రంగుల సంతకం చేసింది.