మళ్ళీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

 

పెట్రోల్, డీజిల్ ధరలు నిన్న అర్ధరాత్రి నుండి మళ్ళీ తగ్గాయి. పెట్రోల్ పై లీటరుకి రూ.1.27, డీజిల్ పై రూ.1.17 ధరలు తగ్గాయి. ఈనెల మొదట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. మళ్ళీ రెండు వారాల వ్యవధిలోనే మరొకసారి తగ్గడం అదికూడా స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో తగ్గడంతో ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 69.82 ఉండగా అదిప్పుడు రూ.68.55కి తగ్గింది. అదేవిధంగా డీజిల్ ధర రూ.50.27 నుండి రూ.49.10కి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా దిగివస్తుండటంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గాయి.

Teluguone gnews banner