ఆధార్‌తో ఓటర్ అనుసంధానం ఆపండి.. సుప్రీం
posted on Aug 14, 2015 @ 6:47PM
ఆధార్ కార్డుతో ఓటరు అనుసంధానం అంటూ పెద్ద ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ అనుసంధాన ప్రక్రియను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని.. అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మీదట ఓటర్ల నుంచి ఆధార్ నంబర్లు తీసుకొవద్దని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంతేకాదు అధార్ కార్టు తప్పనిసరి కాదని ఈ విషయాన్ని పత్రికలు, టీవీల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌లో పొందడానికి ప్రజలు ఇచ్చిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వరాదని, యఐడీఏఐ విభాగానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రజా పంపిణీ వ్యవస్ధ, గ్యాస్ రాయితీలకు తప్ప మరే పథకానికి ఆధార్ డేటాను ఉపయోగించుకోవడానికి వీల్లేదంటూ గతంలోనే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.