వాడిని ఎవరికన్నా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా..!
posted on Sep 29, 2021 @ 1:52PM
పోసాని కృష్ణమురళి. నాగబాబు మాటల్లో మొరిగే కుక్క. పీకే ఫ్యాన్స్ దృష్టిలో పిచ్చి కుక్క. పోసాని తాను జగన్ అభిమానినని.. వైసీపీ మనిషినని ఆయనే చెప్పుకుంటారు. ఇక వైసీపీ వాళ్లంటే తెలుసుగా.. ఓ కొడాలి నాని, ఓ అనిల్‌కుమార్ యాదవ్.. ఓ పోసాని కృష్ణమురళి. ఇలా ఇంకా చాలామందే ఉన్నా.. ఈ ముగ్గురూ ఓ జాతికే చెందిన వాళ్లంటారు. కొడాలి నాని, అనిల్‌కుమార్‌లు బూతుల మంత్రులగా ఫేమస్ అయితే, ఆ ఇద్దరూ రెండేళ్లలో సంపాదించుకున్న ఆ చెత్త పేరును.. పోసాని మాత్రం ఇక్కరోజులోనే సాధించేశారు. అది నోరా.. సెప్టింగ్ ట్యాంకా? అనేలా దుర్గంధం వెదజల్లారు.
ఏం బాష అది? ఏం తిట్లు అవి? మీడియా ముందు ఎవరైనా అలా వాగుతారా? పోసానికి ఏమైనా మర్యాద, పద్దతి ఉందా? అంటూ సభ్యసమాజం చీదరించుకుంటోంది. అమ్మ-అక్కల నుంచి వాడలేని, వినలేని, రాయలేని భాషలో బూతులు మాట్లాడి ప్రజలందరితో ఛీ..అనిపించుకుంటున్నారు. ఏదైనా విమర్శ చేస్తే అర్థం ఉంటుంది.. ఉపయోగమూ ఉంటుంది. చేసిన విమర్శ ప్రజల్లోకి వెళుతుంది.. ఆలోచింప జేస్తుంది.. చర్చ జరుగుతుంది.. ఫలితం వస్తుంది. కానీ, తిడితే ఏమొస్తుంది? తిట్టినోడిపైనే అసహ్యం పుడుతుంది. కొడాలి నాని, అనిల్‌కుమార్‌లు స్టార్ట్ చేసిన ఈ పైత్యాన్ని పోసాని పీక్స్‌కు తీసుకెళ్లారు. ప్రెస్ క్లబ్ వేదికగా కంపు కంపు మాట్లాడి.. రచ్చ రచ్చ చేశారు. అంతా చేసి ఏం సాధించారు? అందరి ముందు అబాసుపాలయ్యారు. పవన్ కల్యాణ్‌ను నోటికొచ్చినట్టు తిట్టి.. అందరితో తాను తిట్లు తింటున్నారు. పవన్ మీద కోపంతో.. పవన్ తల్లిని.. పెళ్లాన్ని కూడా వదిలిపెట్టనంటూ ఆయన అనేసిన మాటల పైత్యంపై చూసినోళ్లంతా మండిపడుతున్నారు.
పవన్ వైసీపీ నేతల్ని తిట్టారు. వైసీపీ నేతలు ఆయన్ను తిట్టారు. సన్నాసి అని పవన్ అంటే.. పీకేను సన్నాసిన్నర అంటూ పేర్ని నాని అన్నారు. లెక్క అంతవరకు సరిపోయింది. మధ్యలో పోసానికి ఎందుకింతలా పొడుచుకొచ్చిందో అర్థం కాదు. ఆయనే ఇలా ఓవర్‌గా రియాక్ట్ అయ్యారా? లేక, వైసీపీ వాళ్లే పోసానిని పవన్ మీదకు ఎగదోశారా? అనే అనుమానం అయితే ఉంది. ఏదో వచ్చాడు.. అన్నాడు.. పోయాడు.. అనేలా ఉండకుండా.. అలా నోటికొచ్చినట్టు.. అమ్మ..నా..బూతులు తిట్టడం అసలేమాత్రం కరెక్ట్ కాదంటున్నారు. పీకే ఫ్యాన్స్ పోసాని ఫ్యామిలీని టార్గెట్ చేసి తిడితే అందుకు పవన్ ఎలా బాధ్యులు? ఫ్యాన్స్ అలా తిట్టడం తప్పే. మరి, అదే తప్పు పోసాని ఎలా చేస్తారు? అభిమానుల నోటి దూలకు పవన్ కల్యాన్ కుటుంబాన్ని ఎందుకు బలి చేయడం? పవన్ ని పోసాని వ్యక్తిగతంగా విమర్శిస్తూ భార్య.. కూతురు పైనా వీరంగం వేయడంపై అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారు. అందుకే, పోసాని తాట తీసేందుకు ప్రెస్ క్లబ్‌కు పెద్ద సంఖ్యలో వచ్చారు జనసైనికులు. పోలీసుల సాయంతో పోసాని తప్పించుకున్నా.. ఆయన లేపిన గబ్బు..కంపును.. పినాయిల్‌తో కాదు యాసిడ్ పోసి కడిగాల్సి ఉంది.