పవన్ రాంబాబు రగడ, పూరి పై ఫిర్యాదు
posted on Oct 22, 2012 @ 3:12PM
పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా పై తెరాస నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత దానయ్య తెలంగాణ ఉద్యమాన్ని కించపరచేలా సినిమా తీశారని కంప్లైంట్ చేశారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రేచ్చగోట్టేలా నిర్మాత దర్శకుడు కుట్ర చేశారని ఆరోపించారు. అభ్యంతకర సన్నివేశాలను తొలగించకుండానే సినిమాను ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని కించపర్చేలా ఉన్న సన్నివేశాలు తొలగించడంతో సరిపోదని, సినిమానే బ్యాన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేలా సినిమా తీశారని చెప్పారు. రాంబాబు చిత్రంపై వివాదం రావడంతో తాను తీవ్ర౦గా నష్టపోయానని నైజం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రాజు గారు అన్నారు. ఎవరి మనోభావాలు దేబ్బతీనకుండా ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సినిమాపై తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేయడంతో వారికి అభ్యంతరంగా ఉన్న సన్నివేశాలను తొలగించామని చెప్పారు. ఈ సినిమా వివాదం అనుకోకుండా జరిగిన సంఘటన అన్నారు. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి ఈ రోజు నుండి థియేటర్‌లకు పంపిస్తున్నట్లు చెప్పారు.