పాలగుమ్మి విశ్వనాధం కన్నుమూత

 

లలిత సంగీత మధురిమల్ని ఆలిండియా రేడియో ద్వారా అశేష సంగీత అభిమానులకు అందించిన సంగీతవేత్త పాలగుమ్మి విశ్వనాధం కన్నుమూశారు. హైదరాబాద్  దోమల్ గూడలోని తన కూతురు శ్వేత నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. పాలగుమ్మి వయసు 93 సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా వయసుపరంగా వచ్చిన అస్వస్థతతో బాధపడుతున్నారు. ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజుకి స్వయానా సోదరుడు. 15 వేల పాటలకు పైగా లలిత సంగీతాన్ని అందించిన ప్రజ్ఞాశాలి పాలగుమ్మి విశ్వనాథం. 1919లో తూ.గో జిల్లా తిరుపతిపురంలో జన్మించారు. సంగీత భూషణ మర్లా సత్యనారాయణమూర్తి దగ్గర కర్నాటక శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి దగ్గర వీణా వాదనలో శిక్షణ పొందారు. మద్రాసులో సంగీత కళానిధి ఎస్. రామనాథం దగ్గర శిష్యరికం చేశారు. 1954లో ఆలిండియా రేడియో హైదరాబాద్ లో చేరి వేలాది గేయాలకు బాణీలను అందించారు. అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా అనే చిన్నికన్నయ్య గీతం పాలగుమ్మి పేరు చెప్పగానే లలిత సంగీతాభిమానులకు ఠక్కున గుర్తొచ్చే గీతం. ఈ పాటను వింటుంటే కన్నయ్య కళ్లముందే కనపడుతున్నాడా అన్నంతగా వినేవాళ్లు తాదాత్మ్యం చెందుతారని సంగీత అభిమానులు చెప్పుకుంటారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.