పాక్‌పై సెహ్వాగ్ వెయ్యి పరుగులు పూర్తి
posted on Mar 30, 2011 @ 2:50PM
మొహాలీ : మొహాలీ : టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్‌పై వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. బుధవారం పాక్‌తో జరుగుతున్న సెమీస్‌లో సెహ్వాగ్ మూడో బంతిని బౌండరీ కొట్టి తన పరుగుల ఖాతాను తెరిచారు. ఆటను ఫోర్ కొట్టి ప్రారంభించాడు. కాగా సెహ్వాగ్ ఫోర్‌తో ఆటను ప్రారంభించడం ఇది వరుసగా ఆరోసారి. సెహ్వాగ్ పాక్ బౌలర్లపై ధాటిగా విరుచుకు పడుతున్నాడు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. మొహాలీ పిచ్ మొదట సీమర్లకు, ఆ తర్వాత స్పిన్‌కు అనుకూలిస్తుంది. భారత్ ధాటిగా ఆడి 300 పై చిలుకు పరుగులు చేస్తే గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా సచిన్ - సెహ్వాగ్ జోడీ కూడా ధాటిగా ఆడుతూ బౌలర్లపై విరుచుపడుతున్నారు.
కాగా, పాకిస్థాన్ బౌలర్ గుల్ బౌలింగ్‌ను సెహ్వాగ్ రఫాడించాడు. మ్యాచ్ మూడవ ఓవర్‌లో గుల్ బౌలింగ్‌లో సెహ్వాగ్ ఐదు ఫోర్లను బాదాడు. ఉమర్ గుల్ మూడవ ఓవర్‌లో మొదటి రెండు బంతుల్ని, మూడు, నాలుగు, ఐదవ బంతుల్ని బౌండరీకి తరలించారు. సెహ్వాగ్ వ్యక్తిగత స్కోరులో 29 పరుగుల్లో 7 ఫోర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలి ఫోర్ కొట్టిన సెహ్వాగ్ పాకిస్థాన్‌పై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.