ఏపీ ఎన్నికల్లో ఈ నాలుగు వర్గాల ఓట్లే కీలకం అంటున్న ఓవైసీ
posted on Mar 15, 2024 @ 12:20PM
ఏపీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం- జనసేన- బీజేపీ మహా కూటమి కట్టడాన్ని ఓవైసీ తప్పు పట్టారు.
ఏపీలో ఉన్న మైనారిటీలు,
ఆదివాసీలు,
దళితులు,
క్రిస్టియన్లు..
టీడీపీ- జనసేన- బీజేపీ కూటమికి ఓటు వేయరని ఒవైసీ చెబుతున్నారు.
అయితే ఓవైసీ చెబుతున్నట్లు ముస్లిం ఓటు బ్యాంక్ వైసీపీ వైపే వుందా? లేక టీడీపీ కూటమికి ట్రాన్స్‌ఫర్ అవుతుందా? ఏపీ ముస్లింలు ఏమనుకుంటున్నారు?
ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు ఘనంగా ఉన్న నియోజకవర్గాలు. 63 నియోజకవర్గాల్లో గెలుపు ఓటమిని ప్రభావితం చేసేలా ముస్లిం ఓట్లు ఉన్నాయి. ముస్లిం ఓటు రేపు జరుగబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి పడుతోంది.
గత ఎన్నికల్లో ముస్లింలు టోటల్‌గా వైసీపీకే వేశారు. అయితే ఈ సారి ముస్లిం ఓటు బ్యాక్ వైసీపీకి మళ్ళుతుందా? లేదా? ముస్లింలు వైసీపీ పట్ల ఎలాంటి ఆలోచన ధోరణితో ఉన్నారు? ఓ సారి చూద్దాం.
1 విజయవాడ వెస్ట్ - 60000
2 గుంటూరు ఈస్ట్ - 70000
3 నెల్లూరు సిటీ - 60000
4 కర్నూలు - 90000
5 కడప - 80000
6 అనంతపురం అర్బన్ - 55000
7 నంద్యాల - 60000
8 ఆదోని - 70000
9 మదనపల్లి - 50000
10 ప్రొద్దుటూరు - 50000
11 చిత్తూరు - 25000
12 తెనాలి - 25000
13 మచిలీపట్నం - 20000
14 ఒంగోలు - 30000
15 హిందూపురం - 50000
16 గుంతకల్లు - 40000
17 కదిరి - 40000
18 రాయచోటి - 65000
19 తాడిపత్రి - 30000
20 చిలకలూరిపేట - 35000
21 నరసరావుపేట - 30000
22 నెల్లూరు రూరల్ - 30000
23 కావలి - 20000
24 ఉదయగిరి - 32000
25 ఆత్మకూరు - 31000
26 కోవూరు - 22000
27 బద్వేలు - 24000
28 పులివెందుల - 31000
29 కమలాపురం - 30000
30 జమ్మలమడుగు - 25000
31 మైదుకూరు - 27000
32 నందిగామ - 22000
33 జగ్గయ్యపేట - 21000
34 తాడికొండ - 23000
35 మంగళగిరి - 25000
36 పొన్నూరు - 26000
37 ప్రత్తిపాడు - 21000
38 గుంటూరు వెస్ట్ - 30000
39 పెనమలూరు - 25000
40 పెదకూరపాడు - 22000
41 సత్తెనపల్లి - 31000
42 వినుకొండ - 20000
43 గురజాల - 37000
44 మాచర్ల - 20000
45 బాపట్ల -20000
46 పర్చూరు -20000
47 మార్కాపురం - 20000
48 గిద్దలూరు - 27000
49 ఆళ్లగడ్డ - 40000
50 శ్రీశైలం - 42000
51 నందికొట్కూరు - 38000
52 పాణ్యం - 35000
53 బనగానపల్లె - 30000
54 డోన్ - 20000
55 ఎమ్మిగనూరు -27000
56 ధర్మవరం - 20000
57 రాజంపేట - 25000
58 తంబళ్లపల్లె - 25000
59 పీలేరు - 45000
60 మదనపల్లి - 45000
61 పుంగనూరు - 35000
62 చిత్తూరు - 22000
63 పలమనేరు - 38000
1.
జగన్ పాలనలో “ ఉర్దూ ” భాషా కు అధోగతి పట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందని నమ్మిన చంద్రబాబు
రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమలో
ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతం కర్నూలు కేంద్రంగా
2015 లో 145 ఎకరాల విస్తీర్ణంలో అబ్దుల్ హాఖ్ విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని చేపట్టారు.
2019 తరువాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయ నిర్మాణ విషయంపై,
నిధుల కేటాయింపుపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అసలు పట్టించుకోలేదు.
పైగా అబ్దుల్ హఖ్ ఉర్దూ విశ్వవిద్యాలయ భూములపై నేతల కన్ను పడింది.
2.
22 వేల కోట్లు మైనార్టీల కోసం ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెబుతోంది.
కానీ బడ్జెట్ లెక్కలు చూస్తే 2019 నుంచి ఇప్పట్టి వరకు కేవలం 4 వేల 542. 49 కోట్లు
3.
దుల్హన్ పథకం ద్వారా టీడీపీ హయాంలో 48 వేల 693 మంది లాభపడ్డారు.
కానీ ఈ ఐదేళ్ళల్లో కేవలం ఈ పథకం 2 వేల మందికి మాత్రమే అందింది.
4.
మసీదుల మరమ్మత్తులకు 35 కోట్లు ఖర్చు చేస్తే
వైసీపీ హయాంలో కేవలం కోటి రూపాయలే ఖర్చు పెట్టారు
5.
రంజాన్ తోఫా 20 కోట్లు ఖర్చు చేస్తే
వైసీపీ 2 కోట్లు ఇచ్చింది
6.
విదేశీ విద్య పథకం ద్వారా 577 మంది లబ్ది
వైసీపీ 50 మంది
7.
మైనార్టీ కార్పొరేషన్‌లకు 443 కోట్లు కేటాయించి సబ్సిడీపై రుణాలు అందించింది టీడీపీ
వైసీపీ మైనార్టీ కార్పొరేషన్లు పెంచింది కానీ బడ్జెట్ అస్సలు ఇవ్వలేదు.
8.
8-11-2020
నంద్యాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ రెడ్డి వేధింపుల కారణంగా ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబమంతా ఆత్మహత్యకు పూనుకుంది. షేక్ అబ్దుల్ సలాం, అతని భార్య నూర్జహన్ పాటుగా 14 ఏళ్ల కూతురు సల్మా, 12 ఏళ్ల కుమారుడు దాదా కలందర్ వీరంతా గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణాలకు పూనుకున్నారు.
9.
17-8-2023
కర్నూల్ జిల్లా, గొనేగండ్ల మండలం, ఎర్రబాడు గ్రామానికి చెందిన హజిరా అనే అభాగ్యురాలికి అన్యాయం జరిగి, ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు న్యాయం జరగలేదు.
10.
26-3-2022
చిత్తూరు జిల్లా పలమనేరులో నిరుపేద టెన్త్ విద్యార్ధిని మిస్బా ఆత్మహత్య ఘటన.
తన కూతురే స్కూల్ టాపర్ గా ఉండేందుకు మిస్బా అనే విద్యార్థినిని స్కూల్ మాన్పించేలా స్థానిక వైసీపీ నేత సునీల్ వ్యవహరించాడు.
మిస్బాను స్కూల్ నుంచి వెళ్లగొడితే తప్ప తన కూతురు పూజిత టాపర్‌గా నిలవదని సునీల్ ఫిక్సయ్యారు. అందుకే మిస్బా కుటుంబ పేదరికాన్ని తూలనాడుతూ ఆమెను పాఠశాల నుంచి వెళ్లగొట్టాలని బ్రహ్మర్షి స్కూల్ ప్రిన్సిపల్ కు నూరిపోశారు. దీంతో, మిస్బాను అవమానిస్తూ వేరే స్కూల్ చేరేలా ప్రిన్సిపాల్ ఒత్తిడి చేశారు. సునీల్ తో తలపడలేని ఆ నిస్సహాయ తల్లిదండ్రులు ఆమెను వేరే పాఠశాలలో చేర్పించారు. ఫలితం పాపం ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది.
11.
మంత్రి బొత్స సత్యనారాయణ
శాసనమండలి ఛైర్మన్ అహ్మద్ షరీఫ్‌ను
నువ్వు ముస్లింకే పుట్టావా అంటూ మాట్లాడడం
ఈ అంశాలపై ముస్లిం కమ్యూనిటీలో చర్చ అయితే సీరియస్‌గా జరుగుతోంది. తెలంగాణాలో బీజేపీని బూచిగా చూసినట్లు ఆంధ్ర ముస్లింలు చూడరు. గతంలో చంద్రబాబు హయాంలో ముస్లింలు లాభపడినట్లు చెబుతున్నారు. జగన్ పాలనలో చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాల్ని అమలు చేయలేదనే అసంతృప్తి బాగా వున్న నేపథ్యంలో ముస్లిం ఓట్లు టీడీపీ కూటమికి మళ్ళడం పక్కా అంటున్నారు ముస్లిం నేతలు.