కోడి గుడ్డే కానీ... పెద్ద కథే..
posted on Jun 25, 2021 @ 11:04AM
మన టైం బాగాలేకుంటే వాసుదేవుడు గాడిగా కాళ్ళు పట్టుకున్నట్లు ఉంటుంది మన పరిస్టితి. అలాగే జొన్న గింజతో కొడితే ప్రాణం పోయినంత సిల్లీగా గా ఉంటుంది. కొన్ని సార్లు చేసింది చిన్న తప్పే అయినా పెద్ద శిక్షలు పడుతుంటాయి. తప్పు చెయ్యడం శిక్షలు పాడడం ఒక ఎట్టు అయితే. కోడి కత్తికి మనిషి మృతి, కోడిని అరెస్ట్ చేసిన సిల్లీ కేసులు కూడా విన్నాం. కోడిని చంపినా వ్యక్తి అరెస్ట్ అనే సంఘటనలు కూడా విన్న చూశాం.. బట్ కోడి గుడ్డు ఒక వ్యక్తిని గాయాల పాలు చేసింది.. మరో వ్యక్తిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పింది. భలే ఉంది కదా అయితే మొత్తం వార్త చదవండి ఇంకా కిక్కు ఉంటుంది.
టైం ఎంత చెత్తగా ఉంటుందంటే చెప్పలేం. చిన్న కారణం.. తెచ్చే చిక్కులు తరువాత తీరుబడిగా ఆలోచిస్తే తేలుతాయి తప్పులు. కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే.. చిన్న విషయాన్ని ఒక్కోసారి చాలా ప్రేస్టేజియస్ గా తీసుకుంటారు. కోటి రూపాయలు పోయిన అంత పట్టించుకోరుగాని వారి అహం దెబ్బ తింటే తట్టుకోలేరు. విపరీతమైన ఫీల్ అవుతారు నానా హంగామా చేసేస్తారు. దీంతో వారు ఎదుటివారితో చాలా చికాకుగా ప్రవర్తించడమే కాకుండా వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసి.. తామూ చిక్కుల్లో పడతారు. అటువంటిదే ఈ సంఘటన కూడా. ఒక్క కోడిగుడ్డు ఒక వ్యక్తిని గాయాల పాలు చేసింది. మరోవ్యక్తిని పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పింది. బెంగళూరు లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒక యువకుడు చికెన్ కొనడానికి షాప్ కి వెళ్ళాడు. పాపం చికెన్ కొనడానికి వెళ్లిన వాడు ఈ మధ్య సోషల్ మీడియాలో వీడియోలు ఎక్కువగా చూసినట్లున్నాడు. అయితే చికెన్ అమ్మే వాడు చికెన్ కొడుతున్న సమయంలో అక్కడ ఒక గుడ్డు తీసుకుని సంచిలో వేశాడు. అది చూసిన దుకాణం యజమాని ఆ యువకుడిని కోపంతో దానా ధన్ లాగి కొట్టాడు. దీంతో ఆ యువకుడు గాయపడ్డాడు. అక్కడితో ఆగక ఈ విషయం పోలీసుల వద్దకు చేరింది. బెంగళూరు బేగూర్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 28 ఏళ్ల గోపి ఆర్ ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. ఇతను వైట్ఫీల్డ్ సమీపంలోని చిక్కా బేగూర్ నివాసి. ఆదివారం మధ్యాహ్నం అక్కడికి దగ్గరలోని శాంత కుమార్ అనే వ్యక్తి నడుపుతున్న చికెన్ సెంటర్ కు చికెన్ కోసం వెళ్ళాడు. రెండు కేజీల చికెన్ ఆర్డర్ చేశాడు. చికెన్ సిద్ధం అవుతున్న సమయంలో గోపీ అక్కడ ఉన్న ఒక క్రేట్ నుంచి ఒక గుడ్డును తీసుకున్నాడు. అయితే, ఇది శాంతకుమార్ కు చెప్పకుండా చేశాడు. దీంతో శాంతకుమార్ గుడ్డు ఎందుకు తీశావంటూ గోపీ తో వాగ్వాదం పెట్టుకున్నాడు. నేను చికెన్ డబ్బులు ఇచ్చేటప్పుడు గుడ్డు డబ్బులు కూడా ఇస్తాను అని గోపీ చెప్పాడు. అయితే, శాంత కుమార్ వినిపించుకోకుండా గోపీని దొంగ అంటూ మాట్లాడాడు. దాంతో ఇద్దరి మధ్యా వాదోపవాదనలు గట్టిగా జరిగాయి. ఈ క్రమంలో శాంతకుమార్ కోపం పట్టలేక.. ఇనుప కడ్డీతో గోపీ పై దాడి చేశాడు. దీంతో గోపీ గాయాల పాలయ్యాడు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బెగూర్ పోలీసులు దుకాణ యజమాని శాంత కుమార్ పై క్రిమినల్, బెదిరింపు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.