నవంబర్ లో బ్యాంకు సెలవులు ఇన్ని రోజులా..!
posted on Oct 28, 2021 @ 10:33AM
దేశంలో ప్రస్తుతం పండుగల సీజన్ కొనసాగుతోంది. దసరా ముగియగా దీపావళి రాబోతోంది. తర్వాత క్రిస్మత్, సంక్రాంతి రానున్నాయి. ఫెస్టివల్ సీజన్ కావడంతో సెలవులు ఎక్కువగానే ఉంటాయి. అయితే నవంబర్ లో బ్యాంకులకు భారీగా సెలవులు రాబోతున్నాయి. నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 17 సెలవులు వచ్చాయి. అంటే నెలలో సగానికి కన్నా ఎక్కువ రోజులు సెలవులే అన్నమాట. నెలలో కేవలం 13 రోజులు మాత్రం వర్కింగ్ డేస్.
దేశవ్యాప్తంగా నవంబర్ లో బ్యాంకులకు సెలవులు ఇవే...
నవంబర్ 1 కన్నడ రాజ్యోత్సవ, కుట్ (బెంగళూరు, ఇంఫాల్)
నవంబర్ 3 నరక చతుర్దశి (బెంగళూరు)
నవంబర్ 4 దీపావళి (హైదరాబాద్ సహా దాదాపు అన్ని రీజియన్లలో సెలవు)
నవంబర్ 5 దీపావళి, బలి ప్రతిపాద, విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే, గోవర్ధన పూజ
నవంబర్ 6 భాయ్ దుజ్, చిత్రగుప్త్ జయంతి, లక్ష్మీ పూజ, దీపావళి, నింగోల్ చక్కౌబా
నవంబర్ 7 ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)
నవంబర్ 10 ఛాత్ పూజ, సూర్య పస్థి దళ ఛాత్ (పాట్నా, రాంచీ)
నవంబర్ 11 ఛాత్ పూజ (పాట్నా)
నవంబర్ 12 వంగల ఫెస్టివల్ (షిల్లాంగ్)
నవంబర్ 13 రెండో శనివారం (అన్ని రీజియన్లలో సెలవు)
నవంబర్ 14 ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)
నవంబర్ 19 గురునానక్ జయంతి (హైదరాబాద్ సహా దాదాపు అన్ని రీజియన్లలో సెలవు)
నవంబర్ 21 ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)
నవంబర్ 22 కనకదాస జయంతి (బెంగళూరు)
నవంబర్ 23 సెంగ్ కుత్స్‌నెమ్ (షిల్లాంగ్)
నవంబర్ 27 నాలుగో శనివారం (అన్ని రీజియన్లలో సెలవు)
నవంబర్ 28 ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)
హైదరాబాద్ రీజియన్‌లో బ్యాంకులకు సెలవుల వివరాలు..
నవంబర్ 4 దీపావళి
నవంబర్ 7 ఆదివారం
నవంబర్ 13 రెండో శనివారం
నవంబర్ 14 ఆదివారం
నవంబర్ 19 గురునానక్ జయంతి
నవంబర్ 21 ఆదివారం
నవంబర్ 27 నాలుగో శనివారం
నవంబర్ 28 ఆదివారం
నవంబర్ నెలలో హైదరాబాద్ రీజియన్‌లో 8 సెలవులు వచ్చాయి. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌లో బ్యాంకులు 8 రోజులు తెరుచుకోవు. అందులో 4 ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, దీపావళి, గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉంటాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తుంది.