కరోనా కు వ్యాక్సిన్ రెడీ చేసిన నైజీరియా..!!
posted on Jun 23, 2020 @ 9:57AM
ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అమెరికా, బ్రిటన్, భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్ వంటి అభివృధి చెందిన దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీనికోసం అనేక వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తున్న సమాచారం ప్రకారం 13 వ్యాక్సిన్లు ప్రస్తుతం మనుషుల పై ప్రయోగ దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐతే తాజాగా అందుతున్న సమాచారం ప్రక్రారం నైజీరియా సైంటిస్టులు కరోనా కు వ్యాక్సిన్ కనుగొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి నైజీరియన్ యూనివర్సిటీలు ఒక ప్రకటన చేసినట్లు లోకల్ మీడియా తెలిపింది.
ఆఫ్రికా ప్రజల కోసం ఆఫ్రికాలో ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు ఆడిలెక్ యూనివర్సిటీ వైరాలజి నిపుణుడు డాక్టర్ వోలాడిపో కోలావోల్ ప్రకటించినట్లు ది గార్డియన్ నైజీరియా ప్రచురించింది. ఈ వ్యాక్సిన్ సామాన్యులకు అందుబాటులోకి రావడానికి 18 నెలలు టైం పట్టవచ్చని డాక్టర్ కోలావోల్ తెలిపారు. దీని పై మరి కొన్ని ట్రయల్స్ అవసరమని అలాగే దీనికి హెల్త్ డిపార్ట్ మెంట్ నుండి అనుమతి కూడా రావాల్సి ఉందని అయన తెలిపారు. కోవిడ్ జినోమ్ కోసం ఆఫ్రికా అంతటా సెర్చ్ చేసి సాధించామని అయన తెలిపారు. వ్యాక్సిన్ రెడీ చేసిన మాట నిజమే.. దీని కోసం చాల ప్రయోగాలు చేసి ఎనలైజ్ చేసాం అని ప్రీషియస్ కార్నర్ స్టోన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జూలియస్ వోలోక్ దీనిని ధృవీకరించారు. ఆఫ్రికన్లు లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ ను తయారు చేసినప్పటికీ ఇది అందరికి ఉపయోగపడుతుందని అయన తెలిపారు. ఫైనల్ గా వ్యాక్సిన్ ఎవరు తయారు చేశారు అనే దాని కంటే అది త్వరగా అందరికి అందుబాటులోకి వస్తే ప్రపంచానికి అంతకంటే కావాల్సిందేముంది.