సంక్రాంతి కల్లా ఏపీకి కొత్త సీఎం.. జగన్‌కు షాకింగ్ న్యూస్..
posted on Sep 11, 2021 @ 6:12PM
సీఎం జగన్ మెడపై సీబీఐ, ఈడీలతో పాటు రఘురామ బెయిల్ రద్దు కేసులు వేలాడుతున్నాయి. ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూ ఊహించలేకపోతున్నారు. జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా వేగంగా పరిణామాలు మారిపోతుండటంతో.. వైసీపీలో హైటెన్షన్ నెలకొంది. తాడేపల్లిలోని జగన్ నివాసంలో నిశ్శబ్దం ఆవహించింది. అయితే, జగన్‌కు జైలా? బెయిలా? అనేది సీబీఐ కోర్టులో తేలనున్నా.. అటు, ఢిల్లీలో సైతం జగన్‌కు వ్యతిరేకంగా పావులు కదులుతున్నాయనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. అయితే, హస్తిన రాజకీయాల్లో మంచి పట్టున్న ఓ సీనియర్ నేత తాజాగా చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. త్వరలోనే సీఎం జగన్ పదవి ఊడిపోనుందని.. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసి చెప్పడం సంచలనంగా మారింది.
మరీ ఎంతో దూరంలో లేదట. భోగి పండుగలోపు ఏపీకి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారట. అందుకే, సీఎం కుర్చీ పోతుందన్న దిగులుతోనే.. జగన్ బయటకు రావడం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన కామెంట్లు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీలో చర్చణీయాంశమైంది. వైసీపీలో టెన్షన్ మొదలైంది. ఢిల్లీ నుంచి అందిన పక్కా సమాచారంతోనే చింతా మోహన్ ఇలాంటి ప్రకటన చేసుంటారని అంటున్నారు. సంక్రాంతికల్లా ఏపీ ముఖ్యమంత్రి మారుతారని అంత కచ్చితంగా చెబుతున్నారంటే.. ఆ మేరకు కీలక ఇన్ఫర్మేషన్ ఏదో ఆయన దగ్గర ఉండే ఉంటుందని చెబుతున్నారు. ఢిల్లీ లీకుల మేరకే ఆయనలా అన్నారని తెలుస్తోంది. సంక్రాంతి అంటే.. మరో నాలుగు నెలలు మాత్రమే జగన్ సీఎంగా ఉండేదన్నమాట.
మరోవైపు, చింతా మోహన్ మరో ఆసక్తికరమైన స్టేట్‌మెంట్ కూడా చేశారు. దీపావళిలోపు ఏపీ కాంగ్రెస్‌కు అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు ప్రతినిధిగా నియమితులవుతారని అన్నారు. ఇటీవల రాహుల్‌గాంధీ ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టారని.. చిరంజీవిని ఏపీపీసీసీ చీఫ్ చేయాలని ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి, చింతా మోహన్ అన్నట్టు ఆ అందరికీ ఆమోదమైన నేత చిరంజీవినేనా? అనే చర్చ నడుస్తోంది. ఇలా చింతా మోహన్ రాజేసిన రచ్చ వైసీపీకి ముచ్చమటలు పట్టిస్తోంది.