ఐపీఎస్ లు కొల్లి, ఆంజనేయులుకు బాబు నో అప్పాయింట్ మెంట్
posted on Jun 6, 2024 @ 1:02PM
చంద్రబాబు నాయుడు వైసీపీకి తొత్తులుగా పని చేసిన అధికారులపై కొరడా ఝుళిపించనున్నారు. ఇందుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు కనిసిస్తున్నాయి. ఏపీ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో పలువురు అధికారులు చంద్రబాబును కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపేందుకు ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి వచ్చారు. అయితే ఆయనను కలిసేందుకు చంద్రబాబు నిరాకరించారు.
నంద్యాలలో కొల్లి రఘురామరెడ్డి చంద్రబాబు అరెస్టు సమయంలో పరిధిమీరి వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వైసీపీకి విధేయుడుగా వ్యవహరిస్తున్నారంటూ ఎన్నికల సంఘం కొల్లి రఘురా మరెడ్డిని రాష్ట్రం నుంచి బయటకు పంపేసిన సంగతి తెలిసిందే
అలాగే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు కూడా చంద్రబాబు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. పీఎస్ఆర్ ఆంజనేయులును సెలవుపై వెళ్లాల్సిందిగా ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. అదే విధంగా సీఎస్ జవహర్ రెడ్డికి కూడా ఆదేశాలు అందాయని అంటున్నారు.