Read more!

జగన్మాతా ఇదేంటి తల్లీ!

తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు   షర్మిల అరెస్ట్.. ఈ నేపథ్యంలో ఆమె తల్లి   విజయమ్మ.. మీడియాతో మాట్లాడుతూ... ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డితో.. ఆ రాష్ట్రంతో మనకేంటమ్మ.. ఆ రాష్ట్రంతో.. జగన్ మోహన్ రెడ్డితో మనకేంటి? అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై  నెటిజన్లు..ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనను ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఆయన తల్లిగా వైయస్ విజయమ్మ పెద్ద ఎత్తన ప్రచారం చేశారని... ఆ క్రమంలో  జగన్ వల్లే రాజన్న రాజ్యం సాధ్యం అంటూ ఆమె క్లియర్ కట్‌గా చెప్పారని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

అలాగే.. తన బిడ్డ  జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ఆమె ప్రజల మధ్యకు వెళ్లి మరీ ఓట్లు  అడిగారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇక తన సోదరుడు  జగన్ కోసం జగనన్న వదిలిన బాణాన్నంటూ   షర్మిల సైతం పాదయాత్ర చేపట్టిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కే వరకు.. ఎంత చేయాలో  అంతా విజయమ్మ,   షర్మిల అంతా చేశారని.. కానీ ఆయన అందలం ఎక్కిన తర్వాత జగన్ వీరికి దూరంగా పెట్టడం వల్లనే .. వీరిద్దరు పక్క రాష్ట్రం తెలంగాణకు కాందిశీకుల్లా చేరుకున్నారనీ, ఆ తరువాత ఏపీవైపు చూసిందే లేదని నెటిజన్లు చెబుతున్నారు. గతంలో ఏపీలో జగన్ ను గద్దెనెక్కించడానికి అంతగా పాటుపడిన విజయమ్మకు ఇఫ్పుడు ఏపీ ప్రజలు సమస్యలతో సతమతమౌతుంటే  పట్టదా అని నిలదీస్తున్నారు.  

జగన్ అధికార పీఠం ఎక్కిన తర్వాత..  రాజధాని అమరావతి  నుంచి నిన్న మొన్నటి ఆక్వా రైతుల సమస్యల వరకు  అన్ని సమస్యలేననీ, అలాగే మూడు రాజధానులు  సహా జగన్ నిర్ణయాలన్నీ ప్రజా వ్యతిరేకంగానే ఉన్నాయనీ, నాడు తన కుమారుడికి ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ ప్రజల వద్దకు వచ్చి చేతులు జోడించి మరీ వేడుకున్న విజయమ్మకు.. ఇప్పడు ఏపీ సమస్యలు పట్టవా? ఏపీతో సంబంధం లేదా అని ప్రశ్నిస్తున్నారు.  మాట తప్పం.. మడం తిప్పం అంటూ జగన్ ఇచ్చిన హామీలూ, వాగ్దానాలు ఇంత వరకూ అమలు కాలేదనీ, వాటి గురించి మీ కుమారుడిని నిలదీయాల్సిన బాధ్యత నాడు జగన్ ను గెలిపించాలని కోరిన మీకు లేదా అని ప్రశ్నిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి వైయస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా నాడు మద్దతు ప్రకటించారని.. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవీ ఏవీ జరగలేదని నెటిజన్లు   వివరిస్తున్నారు. వీటిపై స్పందించాల్సిన బాధ్యత నాడు జగన్ కోసం ప్రచారం చేసిన మీకు లేదా అని నిలదీస్తున్నారు.
 
తెలంగాణలో ప్రస్తుతం.. మీ కుమార్తే వైయస్ షర్మిల పడుతోన్న ఇబ్బందులే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష టీడీపీ నేతలు సైతం గత మూడున్నరేళ్లగా పడ్డుతున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరీ ఈ అంశంలో నాడు మీరు స్పందించి ఉంటే.. నేడు ఈ పరిస్థితి మీ దాకా వచ్చేది కాదని వారు చురకలంటిస్తున్నారు. ఏదీ ఏమైనా నాడు రాజన్న రాజ్యం తీసుకు వస్తాడు నా బిడ్డ అంటూ మీ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రచారానికి దిగి ప్రచారం చేశారని.. మీ మాటలు నమ్మి..ప్రజలు ఓట్లు గంప గుత్తగా వేశారనీ...  కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అందరు చూస్తూ.. ఇదేం ఖర్మ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని నెటిజన్లు అంటున్నారు.