జూన్ 4 జాతీయ సెలవుదినం.. నటుడు నరేష్ డిమాండ్
posted on May 29, 2024 @ 2:11PM
సార్వత్రిక ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి వ్యక్తమౌతోంది. బాధ్యతగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆ ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే హక్కు ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకోవడం మేండటరీ అని చెబుతూ ప్రభుత్వం పోలింగ్ రోజున సెలవు ప్రకటిస్తోంది.
కానీ బాధ్యతగా ఓటేసిన వారికి ఫలితాలు వెంటవెంటనే తెలుసుకునే హక్కును హరిస్తూ ఆ రోజు సెలవు ప్రకటించకుండా పని దినమేనని చెబుతున్నది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు నరేష్ ఓ కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఎక్స్ వేదికగా ఆయన జూన్ 4 ఓట్ల లెక్కింపు రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఆయన ట్వీట్ వెంటనే వైరల్ గా మారింది. లక్షల సంఖ్యలో లైక్ లు షేర్లు చేస్తున్నారు నెటిజనులు. లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలలో ఓటు వినియోగంపై చైతన్యం తీసుకురావడానికి ఓట్ల లెక్కింపు రోజును సెలవుదినంగా ప్రకటించడం ఎంతగానో దోహదపడుతుందని నరేష్ పేర్కొన్నారు.