ప్రేమ సహజీవనం ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్న నిందితుడు అరెస్ట్

 

ప్రేమ పేరుతో యువతులను వలలో వేసి, సహజీవనం ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్న అంతర్జాతీయ మత్తు పదార్థాల ముఠా వ్యవహారాన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో – హెచ్ న్యూ  అధికారులు బట్టబయలు చేశారు. ఈ కేసులో యోమెన్‌కు చెందిన ఒక నైజీరియన్ వ్యక్తిని అధికా రులు అరెస్ట్ చేశారు. విద్యార్థి వీసాపై భారత్‌కు వచ్చిన నిందితుడు, గత నాలుగేళ్లుగా పోలీసుల చేతికి చిక్కకుండా డ్రగ్స్ విక్రయాలు చేస్తూ, యువతు లను తన అక్రమ కార్యక లాపాలకు ఏజెంట్లుగా మార్చుకుంటున్నట్లు భారీ ఎత్తున డబ్బులు సంపా దిస్తూ... ఎంజాయ్ చేస్తు న్నాడని విచారణలో వెల్లడైంది. 

ప్రేమ పేరుతో యువతులకు గాలం

ఈ నైజీరియన్ ప్రేమ పేరుతో యువతులను మోసం చేసి ఈ అక్రమ డ్రగ్స్ దందాలోకి దింపేవాడు. ఇప్పటివరకు ఏడుగురు యువతులతో ప్రేమ, సహజీవనం పేరుతో సంబంధాలు కొనసా గించి నట్లు అధికారులు గుర్తిం చారు.యువతులను టార్గెట్ చేసిన నిందితుడు డ్రగ్స్ అలవాటు పడిన యువతు లను ముందుగా గుర్తించి, వారికి ఉచితంగా మత్తు పదార్థాలు అందిస్తూ పరిచ యం పెంచుకున్నాడు.

ఆ తరువాత ప్రేమ, సహజీవనం పేరుతో వారిని తన నియంత్ర ణలోకి తీసుకున్నాడు. అనంతరం డ్రగ్స్ సరఫరా, తర లింపు బాధ్యతలను వారిపైనే మోపుతూ ఏజెంట్లుగా మలి చేవాడు.నగరాలు మారుతూ దందా మూడు నెలలకు ఒకసారి ఒక నగరం నుండి మరొక నగరానికి మారుతూ పోలీసులకు చిక్కకుండా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతు న్నాడు... 


హైదరాబాద్, బెంగళూరు, గోవా నగరాల్లో ఇప్పటికీ ఐదు ఇళ్లను అద్దెకు తీసుకుని డ్రగ్స్ దందా యదేచ్చగా సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకే చోట ఎక్కువ కాలం ఉండకుండా మారుతూ ఉండటంతో నాలుగేళ్లుగా పోలీసుల కంట పడకుండా తప్పించుకున్నాడు.కొంపల్లి ఘటనతో ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది.

కొంపల్లిలో నర్సుగా పనిచే స్తున్న ఓ యువతితో పరిచయం పెంచుకున్న నిందితుడు, ప్రేమ పేరుతో ఆమెతో సహజీవనం చేస్తూ, ఆమె నివాసంలోనే మత్తు పదార్థాలను నిల్వ చేశాడు. అను మానాస్పద సమాచారం అందడంతో నార్కోటిక్ అధి కారులు దాడులు నిర్వహిం చగా, ఈ డ్రగ్స్ అక్రూ దందా  కాస్త వెలుగులోకి వచ్చింది.

కోడ్ భాషలో డ్రగ్స్ లావా దేవీలు  డ్రగ్స్ విక్రయా లకు నిందితుడు ప్రత్యేక కోడ్ భాషను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మూడు ప్రశ్నార్థక చిహ్నాలు (???) పంపితే – “మాల్ కావాలి” అనే అర్థం....
నిందితుడి నుంచి మూడు చుక్కలు (…) వస్తే – డ్రగ్స్ రెడీగా ఉన్నట్లు సంకేతం...

ఓషన్ గంజా కోసం “సముద్రం” అనే పదం.

గ్రీన్ MDMA కోసం ప్రత్యేక సింబల్స్ వినియోగం.

ముంబైలో డ్రగ్స్ స్మగ్లర్లు MDMAకు ఉపయోగిస్తున్న కోడ్ భాషను ఇప్పటికే  HNEW పోలీసులు గుర్తించారు. ఈ నిందితుడి కమ్యూనికేషన్‌ను ట్రాక్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.డ్రగ్స్ సరఫరాలో అన్ని రకాల మత్తు పదార్థాలకు కామన్ కోడ్‌గా “స్కోర్” అనే పదాన్ని వాడుతున్నట్లు విచారణలో తేలింది.

“మామ స్కోర్ చేసావా?” అంటూ ఆర్డర్ ఇచ్చి డ్రగ్స్ లావాదేవీలు నిర్వహించేవాడని అధికారులు తెలిపారు. లోతైన దర్యాప్తులో నిందితుడి తో సంబంధాలు కలిగి ఉన్న యువతులు, డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర సభ్యులపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని NCB–HNEW అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో ఉన్న సంబంధాలపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

సోనియా, రాహుల్‌కు హైకోర్టు నోటీసులు

  నేషనల్ హెరాల్డ్ కేసులో  కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ దాఖలు చేసుకున్న అప్పీల్‌ఫై సమాధానం ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణన జనవరికి వాయిదా వేసింది. కాగా నేషనల్ హెరాల్డ్  మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతరులపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.  ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కేసులో వేసిన ఛార్జ్‌షీటు కూడా చట్టపరంగా నిలవదని డిసెంబర్ 16న న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 

మేడ్చల్ లో విద్యార్థి మిస్సింగ్.. బతికున్నాడా లేదా అంటూ తల్లిదండ్రుల ఆందోళన

మేడ్చల్ లోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది.  ఆ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న కార్తీక్ అనే 14 ఏళ్ల విద్యార్థి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడి ఆచూకీ గత ఎనిమిది రోజులుగా లభించకపోవడంతో ఆ విద్యార్థి తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   ఈ నేప థ్యంలో కుటుంబ సభ్యులు స్కూల్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ బాలుడి ఆచూకీ లభించలేదు.  తమ కుమారుడి మిస్సింగ్‌కు స్కూల్ యాజమాన్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్కూల్ ఆవరణలో చలి మంట వేసుకున్న కారణంగా వార్డెన్ తమ కుమారుడిని చితకబాదాడని, ఆ దాడి కారణంగానే కార్తీక్ భయంతో స్కూల్ నుంచి వెళ్లిపోయి ఉంటాడనీ వారంటున్నారు. ఈ ఘటనపై స్కూల్ యాజ మాన్యం సరిగా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. అసలింతకీ తమ కుమారుడు బతికి ఉన్నాడా? లేదా అన్న అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.   ఇలా ఉండగా.. కార్తీక్ ఆచూకీ కోసం మేడ్చల్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. స్కూల్ పరిసరాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. 

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం- 15 మంది దుర్మరణం

ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలు బెంబేలెత్తిస్తు న్నాయి.  రోడ్డు, రైలు విమాన అన్న తేడా లేకుండా ఈ ప్రమాదాలు పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల ఉసురు తీస్తున్నాయి. సాంకేతిక సమస్య, మానవ తప్పిదం కారణమేమైతేనేం ప్రయాణం అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇండోనేసియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.  ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో ని సెమరాంగ్ నగరం  టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది.  సోమవారం (డిసెంబర్ 22) తెల్లవారుజామున  ఈ ప్రమాదం జరిగింది. బస్సు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.    క్రాప్యాక్ టోల్ ఎగ్జిట్ కూడలి వద్దకు రాగానే బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ని బలంగా ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు అద్దాలు పగిలి, డోర్లు మూసుకుపోయాయి. దీంతో బస్సులోకి వెళ్లి క్షతగాత్రులను బయటకు తీసుకురావడం సమస్యగా మారింది. స్థానికుల సహకారంలో ఎలాగో బస్సు డోర్లను తెరిచి లోపలకు వెళ్లిన పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

అండర్ -19 ఆసియా కప్ ఫైనల్.. పాక్ చేతిలో భారత్ చిత్తు

అండర్ 19 ఆసియాకప్ టోర్నీలో ఓటమి అనేదే లేకుండా ఫైనల్ కు చేరిన టీమ్ ఇండియా జట్టు ఫైనల్ లో చతికిల పడింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.  ఆదివారం (డిసెంబర్ 22)  ఏకపక్షంగా జరిగిన అండర్ -19 ఆసియా కప్ ఫైనల్ లో భారత జట్టు ఏకంగా 191 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి, దాయాది జట్టు అయిన పాకిస్థాన్ చేతిలో  ఓడిపోయింది.   అండర్‌-19 ఆసియా కప్‌ టైటిల్‌ ఫైట్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన  పాకిస్థాన్ నిర్ణీత  50 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి   347 పరుగుల భారీ స్కోరు చేసింది. పాకిస్థాన్ ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌  113 బంతుల్లో 172 పరుగులు చేశాడు.  అలాగే పాక్ బ్యాటర్ అహ్మద్‌ హుస్సేన్‌  56  పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో  దీపేష్‌ దేవేంద్రన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. హనిల్‌, ఖిలన్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.  భారీ చేదన కోసం బ్యాటింక్ చేపట్టిన భారత్ 26. 2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవి చూసింది.  భారత బ్యాటర్లలో 36 పరుగులు చేసిన దీపేష్ టాప్ స్కోరర్.  కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (2), వైభవ్‌ సూర్యవంశీ (26) ఇలా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు.   పాక్‌ పేసర్ల షార్ట్‌ పిచ్‌ బంతులకు  భారత యువ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది.  పాకిస్థాన్ బౌలర్లలో అలీ రెజా నాలుగు వికెట్ల సాధించి రాణంచాడు.  సుభాన్‌, ఎహ్‌సాన్‌, సయ్యమ్‌ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. పాక్‌ ఆటగాళ్లతో  నో హ్యాండ్‌ షేక్‌  విధానాన్ని ఈ మ్యాచ్ లో కూడా ఇండియన్ క్రికెటర్లు పాటించారు.   కాగా ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్ అలీ రెజా అద్భుతంగా బౌలింగ్ చేసి రాణించినప్పటికీ, అతడి ప్రవర్తన మాత్రం అతిగా ఉంది. ధాటిగా ఆడే క్రమంలో ఔటై పెవిలియన్ కు వెడుతున్న వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టేలా అలి రోజా సంబరాలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ కూడా తన నోటికి పని చెప్పాడు. అలాగే అంతకు ముందు  భారత జట్టు కెప్టెన్  ఆయుష్‌ అవునప్పుడు కూడా  అలీ రెజా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో డగౌట్‌కు వెళ్తున్న ఆయుష్‌ ఆగ్రహంతో వెనక్కి వచ్చి నోటికి పని చెప్పాడు.  ఆసియా క్రికెట్‌ మండలి  ఏసీసీ  చీఫ్‌, పాకిస్థాన్‌ మంత్రి అయిన మొహిసిన్‌ నఖ్వీ విజేతలకు పతకాలు, ట్రోఫీ ప్రదానం చేశారు. అయితే, భారత్‌కు చెందిన ప్రతినిధులు ఎవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు. రన్నరప్‌ చెక్‌ను అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మిర్వాసి అష్రఫ్‌ చేతుల మీదుగా భారత కెప్టెన్‌ ఆయుష్‌ అందుకొన్నాడు. కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. నఖ్వీ నుంచి భారత సీనియర్‌ జట్టు ఆసియా కప్‌ను అందుకొనేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల భారీ ఆయుధ డంప్.. గుర్తించి ధ్వంసం చేసిన భద్రతా దళాలు

ఛత్తీస్‌గఢ్ ని మావోయిస్టుల భారీ ఆయుధ డంప్ ను పోలీసులు ధ్వంసం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం అధికంగా ఉన్న సుక్మా జిల్లాలో వారికి చెందిన భారీ ఆయుధాల కర్మాగారాన్ని గుర్తించిన పోలీసులు, భద్రతా బలగాలు దానికి ధ్వంసం చేశారు. సుక్మీ జిల్లా మీనా గట్టా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న అక్రమ ఆయుధ తయారీ కేంద్రాన్ని గురించి అందిన సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో ఈ ఆయుధ డంప్ బయటపడింది. ఈ ఆయుధ డంప్ ను మావోయిస్టులు భద్రత దళాలపై దాడికి ఉపయోగిస్తారని భద్రతా దళాలు తెలిపాయి. ఈ డంప్ ధ్వంసంతో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఆటంకం తప్పదని తెలిపారు.   ఈ ఆయుధ డంప్ లో  ఆయుధాల తయారీ సామగ్రి, సింగిల్ షాట్ రైఫిల్స్, డిటోనేటర్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.  భద్రతా దళా లను లక్ష్యంగా చేసుకుని ఐఈడీలు, బాంబులు తయారు చేసేందుకు అవసరమైన మందుగుండు సామాగ్రిని మావోయిస్టులు అక్కడ నిల్వ ఉంచారన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా నక్సల్స్ దాక్కుని ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో ఆ ప్రాంతంలో అడవులను అణువణువూ క్షుణ్ణంగా గాలిస్తున్నట్లు తెలిపిన భద్రతా బలగాలు  నిర్దిష్టగడువులోగా మావోయిస్టు రహిత దేశంగా భారత్ ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. 

బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ఇస్రో మరో చారిత్రక ప్రయోగానికి రెడీ అయిపోయింది. ఎల్వీఎం 3 బాహుబలి రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఈ నెల 24 ప్రయోగించనుంది. ఇది  సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాలకు సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన భారీ మిషన్.  4జీ, 5జీ సిగ్నల్‌ను నేరుగా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు అందించడానికి ఉద్దేశించిన ప్రయోం.  ఈ నెల 24  ఉదయం 8:54 నిమిషాలకు ఎల్వీఎం 3  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి అంతరిక్షానికి దూసుకెళ్లనుంది. ఎల్వీఎం 3 సిరీస్ లో ఇది తొమ్మిదది. ఈ ఏడాది ఇస్రో  చేపట్టిన అయిదో ప్రయోగం ఇది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ అభివృద్ధి చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2, ఉపగ్రహ టెలికమ్యూనికేషన్స్‌లో ఓ వ్యూహాత్మక ప్రయోగంగా భావిస్తున్నారు.   బ్లూబర్డ్ బ్లాక్ శాటిలైట్ బరువు 6,100 కిలోలు. ఈ బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. 640 టన్నుల బరువు. ఈ ప్రయోగం విజయవంతమైతే   కమ్యూనికేషన్ల ముఖచిత్రం మారిపోతుందంటున్నారు. ఇలా ఉండగా ఈ  బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్  తిరుమల శ్రీవారి ఆలయంలో బ్లూబర్డ్  2 ఉపగ్రహానికి పూజలు చేశారు. 

జగన్ జన్మదినం సందర్భంగా పశుబలి

అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా వైసీపీయులు చేసేది అరాచకమే అన్నది మరో సారి రుజువైంది.  రప్పా.. రప్పా.. గంగమ్మ జాతర అంటూ రచ్చ చేస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ అధినేత జగన్ జన్మదినం సందర్భంగానూ హంగామా చేశారు. మూగజీవాలను బలి ఇచ్చి వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేసి తమ అరాచకానికి హద్దులు అంటూ లేవని మరోసారి నిరూపించుకున్నారు.  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో  ఆదివారం (డిసెంబర్ 21) వీరంగం సృష్టించారు. సర్పంచ్‌ ఆదినారాయణరెడ్డి  ఆధ్వర్యంలో  ఐదు గొర్రెలను  నరికి, వాటి రక్తంతో జగన్‌ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు.  మండల కేంద్రమైన విడపనకల్లు లోనూ అదే తంతు కొనసాగింది. అలాగే శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో వైసీపీ మద్దతు సర్పంచ్‌ బాలరాజు, నాయకులు కలసి మూగజీవాల తలలు నరికి, ఆ రక్తంతో జగన్‌ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు.   మరోవైపు జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా పందువ నాగులారం పంచాయతీ పరిధిలోని గుమ్మలకర్ర జంక్షన్‌లో వైసీపీ అభిమాని ఒకరు   2029లో రప్పరప్ప.. 88 మ్యాజిక్‌ ఫిగర్‌ దాటినప్పటి నుంచి గంగమ్మ జాతరే అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గుమ్మలకర్ర గ్రామానికి చెందిన మన్నెపల్లి దినేష్‌ ఈ వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారంటూ తెలుగుదేశం  శ్రేణులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఫ్లెక్సీని తొలగించి దినేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

కూలిపోతున్న మస్క్ ఉపగ్రహం

ఎలాన్ మస్క్ కు చెందిన  స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహం కక్ష్య నుంచి అదుపుతప్పి భూమి వైపు దూసుకొస్తోంది. సాంకేతిక లోపం  కారణంగా ఇది భూమి వాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుందని స్పెస్ ఎక్స్ ధృవీకరించింది. అయితే ఈ శాటిలైట్ భూమిపై కూలి పోవడం వల్ల స్పేస్ ఎక్స్ కు కానీ, భూమికి కానీ ఎటువంటి ప్రమాదం, ముప్పు వాటిల్లదని క్లారిటీ ఇచ్చింది. టెస్లా అధినేత  ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్‌ ప్రాజెక్టులోని ఉప్రగ్రహాల్లో ఒకటి డిసెంబరు 17న సాంకేతిక లోపం కారణంగా అదుపు తప్పి కూలిపోవడం ప్రారంభించింది. వారం రోజుల్లోగా ఇది భూవాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుంది.  ఈ కూలిపోతున్న  స్టార్ లింక్ శాటిలైట్ శకలాలను వరల్డ్ వ్యూ-3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

రోహిత్, కోహ్లీ సరసన స్మృతి మంధాన

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన టి20లలో నాలుగు వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో ఆదివారం (డిసెంబర్ 21) జరిగిన టి20 మ్యాచ్ లో పాతిక పరుగులు చేసిన స్మృతి మంధాన ఈ రికార్డు సృష్టించింది. మొత్తంగా టి20 ఫార్మట్ లో నాలుగువేల పరుగుల క్లబ్ లో చేరిన రెండో మహిళా క్రికెటర్ గా నిలిచింది.  న్యూజిలాండ్ ప్లేయ‌ర్ సుజీ బేట్స్ 4,716 ప‌రుగుల‌తో తొలి స్థానంలో ఉంది.   స్మృతి మంధానా  154 మ్యాచుల్లో 4007 ర‌న్స్ చేసింది. ఇందులో ఒక సెంచ‌రీతో పాటు 31 అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి.  మొత్తం మీద టీ20 క్రికెట్‌లో పురుషులు, మహిళలను పరిగణనలోనికి తీసుకుంటే ఇంత వరకూ స్మృతి మంధానాతో కలిసి  ఐదుగురు మాత్రమే ఈ ఫార్మట్లో నాలుగువేల పరుగుల మైలు రాయిని దాటారు. ఇండియా నుంచి అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వారి సరసన స్మృతి మంధానా చేరింది.  ఈ ముగ్గురూ కాకుండా బేట్స్, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం మాత్రమే ఈ ఫార్మట్ లో నాలుగువేలు అంతకు మించి పరుగులు చేశారు. ఇలా ఉండగా ఈ జాబితాలో అందరి కంటే పిన్న వియస్కురాలు స్మృతి మంధానా మాత్రమే కావడం గమనార్హం.