జైలులో ఉన్నప్పుడు మీకిచ్చిన నెంబర్.. టోల్‌ఫ్రీకి పెడితే సింబాలిక్‌గా ఉండేది
posted on Aug 25, 2020 @ 5:20PM
ఏపీలోఅవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్ 14400 ప్రారంభించిన సంగతి తెలిసిందే. అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలు, 14400 కాల్ సెంటర్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కేసుల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో చట్టం చేసేందుకు వీలుగా బిల్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలని తెలిపారు. 14400 నంబర్‌పై మరింత ప్రచారం నిర్వహించాలి, పర్మినెంట్ హోర్డింగ్స్ పెట్టాలని సీఎం పేర్కొన్నారు.
కాగా, జగన్ సర్కార్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్ 14400 పెట్టడం, అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు.
"వైఎస్ జగన్ గారూ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్ 14400 పెట్టారు. అవినీతి చక్రవర్తి, క్విడ్‌ప్రోకో కింగ్, ప్రజలసొమ్ము 43 వేల కోట్లు కొట్టేసి సీబీఐ..ఈడీ కేసుల్లో ఏ1గా ఉంటూ చంచల్‌గూడలో 16 నెలల్లో జైలులో ఉన్నందుకు గుర్తుగా మీకిచ్చిన నెంబర్ 6093. ఇదే నెంబర్ అవినీతి పై ఫిర్యాదు చెయ్యడానికి టోల్‌ఫ్రీకి పెడితే సింబాలిక్‌గా ఉండేది!" అంటూ ఎద్దేవా చేశారు.
"మీరు దోచేసిన ప్రజా సొమ్ము ప్రభుత్వ ఖజానాకి జమచేసి, అప్పుడు అవినీతిపై మాట్లాడితే బాగుంటుంది జగన్ రెడ్డి గారు ఒక సారి ఆలోచించండి." అంటూ లోకేష్ చురకలు అంటించారు.