నా ఆశీర్వాదం వల్లే స్టార్లయ్యారు.. ములాయం
posted on Dec 31, 2015 @ 9:56AM
తమ ఆశీర్వాదం వల్లే బాలీవుడ్ లో కొంతమంది స్టార్లు అయ్యారని చెపుతున్నారు సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్. మామూలుగానే తన గురించి గొప్పలు చెప్పుకోవడంలో ములాయం సింగ్ దిట్ట. ఇప్పుడు తాజాగా ములాయిం సింగ్ యాదవ్ తన గొప్పతనం గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అదేందంటే.. తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ప్రియాంకా చోప్రాను ఆమె తండ్రిని కలిశారట. అయితే అప్పుడు ములాయం ప్రియాంకా చోప్రాను పెద్ద హీరోయిన్ కావాలని ఆశీర్వదించారట.. అంతే తన ఆశీర్వాదం వల్లనే ప్రియాంక చోప్రా ఇప్పుడు పెద్ద హీరోయిన్ అయింది అని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా. ఒక్క ప్రియాంకనే కాదు.. తన ఆశీర్వాదం వల్లనే.. మాధురీ దీక్షిత్.. అమితాబ్ బచ్చన్.. సైఫ్ ఆలీఖాన్ ఇలాంటి చాలామందిని స్టార్లుగా చేశానని తన ఆశీర్వాదం గొప్పతనం గురించి చెప్పుకున్నారు. మరి తన ఆశీర్వాదం వల్ల ఇంత మందిని స్టార్లను చేసిన ములాయం.. అదే చేత్తే తన కొడుకును కూడా ఆశీర్వదించినట్టయితే మంచి స్టార్ అయి ఉండేవాడేమో..