హోమంత్రికే లేనిది.. కేటీఆర్ కు ఎందుకు..? కిషన్ రెడ్డి
posted on Dec 31, 2015 @ 10:21AM
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విషయంలో పోలీసులు ప్రదర్శిస్తున్నతీరుపై మండిపడ్డారు. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు ప్రాంతాలు పర్యటిస్తున్నారు. దీంతో ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ను ఆపేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారమే వివాదాస్పదంగా మారుతుంది. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్.. ముఖ్యమంత్రి.. హోంమంత్రి వరకూ ప్రయాణిస్తుంటే.. ట్రాఫిక్ ఆపేయవచ్చు కానీ మంత్రులు ప్రయాణించే సమయాల్లో ట్రాఫిక్ ఆపేయటం ఉండదు. కానీ అందుకు భిన్నంగా హైదరాబాద్ లోని పలు చోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళుతున్న మంత్రి కేటీఆర్ వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేస్తున్నారట. దీంతో ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా మంత్రి కేటీఆర్ కోసం ట్రాఫిక్ ఎందుకు ఆపేస్తున్నారని.. హోంమంత్రికి లేని ప్రోటోకాల్ కేటీఆర్ కు ఎందుకని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.