ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లపై విచారణ
సామాజిక మాధ్యమాల్లో తమ ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయో గిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నటులు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లను జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారించింది. సోషల్ మీడియా వేదికలపై తమ చిత్రాలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అవమా నకరమైన పోస్టులు పెడుతు న్నారని, వాటి ద్వారా తమ ప్రతిష్ఠకు భంగం కలుగు తోందని పిటిషన్లలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
ఈ విధమైన చర్యలు తమ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తు న్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈపిటిషన్లపై పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ తన వాదనలు కోర్టు కు వినిపించారు. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, అవమానకరమైన వీడియోలతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని ఆయన కోర్టుకు వివరించారు.ఈ వ్యవహారంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ సంస్థ లను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై స్పందించిన ప్రతివాదులు ఇప్పటికే కొన్ని వివాదాస్పద లింకులను తొలగించామని కోర్టుకు తెలిపారు.
అయితే, తొలగించబడిన లింకులపై తుది ఆదేశాలు జారీ చేసే ముందు సంబంధిత లింకులను వినియోగించిన ఖాతాదారుల వాదనలు కూడా వినాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టుల విషయంలో ప్రత్యేకంగా స్పష్టమైన నిరాకరణ (డిస్‌క్లైమర్) ఉండాలని కోర్టు సూచిం చింది.ఈ అంశంపై గూగుల్ సంస్థ తమ ఖాతాదారులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని, అవసరమైతే సంబంధిత ఖాతాలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే, వివాదాస్పద పోస్టులకు సంబంధించిన ఐపీ లాగిన్ వివరాలను మూడు వారాల లోపు కోర్టుకు సమ ర్పించాలని ప్రతివాదులకు సూచించింది. వాదప్రతివాదనలు పూర్తి అయినా తరువాత కోర్టు తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.