అంబానీ అపర కుబేరుడు
posted on Oct 26, 2012 @ 2:30PM
ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన భారతీయుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ వరుసగా ఐదోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. పోర్బ్స్ పత్రిక రూపొందించిన సంపన్నులైన భారతీయుల జాబితాలో ముకేష్ అంబానీని మళ్ళీ మొదటి స్థానం వరించింది. ఏడాది కాలంలో 160 కోట్ల డాలర్లు సంపద కరిగిపోయినప్పటికి ముఖేష్ చేతినుంచి తొలిస్థానం మాత్రం చేజారలేదు. ఈ జాబితాలో రెండో స్థానంలో లక్ష్మి మిట్టల్, మూడోస్థానంలో అజీజ్ ప్రేమ్ జీ, నాల్గో స్థానంలో టాటా గ్రూప్ కి చెందిన పల్లో౦జీ మిస్త్రే, ఐదో స్థానంలో దిలీప్ శంఘ్వీ ఉన్నారు. 900 కోట్ల డాలర్లుతో ఆది గాద్రెజ్ అండ్ ఫ్యామిలి ఆరోస్థానం, 820 కోట్ల డాలర్లుతో సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలి ఏడో స్థానం, 810 కోట్ల డాలర్లుతో శశి అండ్ రవి రుజ ఎనిమిదో స్థానం, 800 కోట్ల డాలర్లుతో హిందూజా బ్రదర్స్ తొమ్మిదో స్థానం, కుమార్ బిర్లా 780 కోట్ల డాలర్లుతో పదో స్థానాన్ని దక్కించుకున్నారు. కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ అధినేత విజయమాల్యా ఈ జాబితాలో సోదిలో లేకుండా పోయారు.. కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ నష్టాలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపడంవల్ల మాల్యా ఫోర్బ్స్ జాబితాలో 49వ స్థానం నుంచి 73వ స్థానానికి జారిపోయారు.