సెప్టెంబర్ 10న జియో 4జీ స్మార్ట్‌ఫోన్.. JioPhone Next ప్రత్యేకతలు ఇవే..
posted on Jun 24, 2021 @ 3:45PM
అందరూ అనుకుంటున్నట్లుగానే రిలయెన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. గూగుల్‌తో కలిసి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. రిలయెన్స్ 44వ ఏజీఎంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ JioPhone Next రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే అన్ని ఫీచర్స్ జియోఫోన్ నెక్స్‌ట్‌లో ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
జియో 4జీ స్మార్ట్‌ఫోన్ రూపొందిస్తుందన్న వార్తలు చాలాకాలంగా వస్తున్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగానే జియో స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఉన్నాయి. భారతీయుల కోసం గూగుల్, జియో కలిసి రూపొందించిన ప్రత్యేక స్మార్ట్‌ఫోన్ ఇది. వాయిస్ అసిస్టెంట్, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ ఫిల్టర్స్‌తో స్మార్ట్‌కెమెరా లాంటి అనేక ఫీచర్స్ ఉంటాయి సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది.
చైనా తర్వాత ఒక దేశంలో అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న నెట్వర్క్ రిలయెన్స్ జియో అని ముకేష్ అంబానీ అన్నారు. ఇండియాలో జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 40 కోట్లు దాటింది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మొబైల్ డేటా క్యారియర్‌గా జియో అవతరించింది. జియో యూజర్లు నెలకు 630 కోట్ల మంత్లీ డేటా ఉపయోగిస్తున్నారు. డేటా వినియోగంలో ఏడాదిలోనే 45 శాతం వృద్ధి కనిపించింది.
జియో నెట్వర్క్‌ను మరింతగా విస్తరించేందుకు మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్టు ముకేష్ అంబానీ ప్రకటించారు. స్పెక్ట్రం కోసం రూ.57,123 కోట్లు, నెట్వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.15,183 కోట్లు అదనంగా ఖర్చు చేశామన్నారు. ఇండోర్ కవరేజ్, డౌన్‌లోడ్ స్పీడ్, వీడియో స్ట్రీమింగ్ కోసం జియో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడుతుందన్నారు. మరో 20 కోట్ల మంది కస్టమర్లను చేర్చుకోగలిగే సత్తా తమకు ఉందని ముకేష్ అంబానీ తెలిపారు.