సీఎం ముందే ఎస్పీ, సెక్యూరిటీ ఆఫీసర్ ఫైటింగ్
posted on Jun 24, 2021 @ 3:12PM
వాళ్లిద్దరు ఉన్నతాధికారులు. ఒకరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తుండగా.. మరొకరు రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమె తెలియద కాని ఇద్దరు అధికారులు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై గొడవ పడ్డారు. కొట్టుకున్నారు. ఏకంగా తన్నుకున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి ముందే జరగడం మరో షాకింగ్. ముఖ్యమంత్రి ముందే ఇద్దరు ఉన్నతాధికారులు కొట్టుకోవడం చూసి స్థానికులంతా షాకయ్యారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది.
హిమాచల్ ప్రదేశ్ లోని కులులో ఓ ఎస్పీ రెచ్చిపోయారు. ఏకంగా సీఎం సెక్యూరిటీ సిబ్బందిపైనే తన ప్రతాపం చూపించారు. ఎస్పీ గౌరవ్ సింగ్ సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ చెంప చెళ్లుమనిపించారు. దీంతో అక్కడే ఉన్న ఇతర సీఎం సెక్యూరిటీ సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తీరుకున్న ఆఫీసర్‌కు కోపం వచ్చింది. మమ్మల్నే కొడతావా అంటూ ఎస్పీని కాలితో తన్నారు. అలా ఎస్పీని తన్నుకుంటూ.. తరుముకుంటూ వెళ్లారు. దీంతో ఎస్పీ ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్పీ, సీఎం సెక్యూరిటీ సిబ్బంది.. ఇద్దరిని పక్కకు లాగి గొడవను సద్దుమణిగేలా చేశారు.
ఈ ఘర్షణ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి తన కారులోనే కూర్చొని ఉన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎయిర్ పోర్టుకు విచ్చేసిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న డీజీపీ ఈ ఘటనపై సమగ్ర వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం సెక్యూరిటీని ఎస్పీ కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి