చంచల్ గూడ జైల్లో మోపిదేవిపై ఈడీ విచారణ
posted on Sep 26, 2012 @ 1:48PM
చంచల్ గూడా జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణని మద్యం సిండికేట్ కేసులో ఏసీబీ ఆధికారులు ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సిబిఐ చార్జ్ షీట్ ఆధారంగా విచారణ చేపట్టిన ఏసీబీ.. మాజీ మంత్రి మోపిదేవి ఇన్వాల్వ్ మెంట్ మీద, ఆయన భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలమీద విచారణ జరపబోతోంది. బుధవారం సాయంత్రం ఐదు గంటలవరకూ చంచల్ గూడ్ జైల్లోనే ఈ విచారణ జరుగుతుందని ఏసీబీ అధికారులు చెప్పారు.