కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ చల్లటి కబురు
posted on May 30, 2024 @ 5:53PM
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని తెలిపింది. గురువారం నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు ఐఎండీ ధృవీకరించింది. మరో మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది.
గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఎంఐడీ ప్రజలకు చల్లటి కబురు అందించింది. ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడడం ఆగస్టు-సెప్టెంబరు నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని ఇప్పటికే ఐఎండీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
1951 నుంచి 2023 వరకు ఎల్‌నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో తొమ్మిదిసార్లు మంచి వర్షాలు కురిశాయని తెలిపింది. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాల కదలిక ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.