మ్యాచ్ కు తెలుగు నటీనటులు
posted on Mar 30, 2011 @ 1:51PM
మొహాలీ: భారత్-పాక్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి పలువురు తెలుగు నటీనటులు మొహాలీ చేరుకుంటున్నారు. వెంకటేష్ క్రికెట్‌ను ప్రత్యక్షంగా చూడటానికే ఎక్కువగా ఇష్టపడతాడు. భారత్-పాక్ మ్యాచ్ కూడా ప్రత్యక్షంగా వీక్షించడానికి వెంకటేష్ సిద్దమయ్యాడు. వెంకటేష్‌తో పాటు సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా వెళ్లనున్నారు. లీడర్ ఫేం రానా కూడా ఈ చిత్రాన్ని ప్రత్యక్షంగా చూడనున్నారు. దమ్ మారో దమ్ చిత్ర ప్రచారంలో బిజీగా ఉన్న రానా అటునుండి అటే బిపాసాతో కలిసి మొహాలీ స్టేడియానికి బయలు దేరారు. మరో యువ నటుడు సిద్దార్థ కూడా మ్యాచ్ చూడటానికి మొహాలీ పయనమయ్యారు. ఇక మరికొందరు నటీనటులు కూడా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడకున్నా పరోక్షంగానైనా చూడాలనే ఉద్దేశ్యంతో షూటింగును రద్దు చేసుకున్నారు. కొందరు తమ షెడ్యూల్‌లో ఈ రోజును కేటాయించలేదు. మరికొందరు షూటింగులో ఉన్నప్పటికీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్ విషయాన్ని తెలుసుకుంటానని చెబుతున్నారు. కాగా మొహాలీలో మ్యాచ్ కారణంగా విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. పంజాబ్‌లో బస్సు, టాక్సీ ఛార్జీల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోను ముఖ్య హోటళ్లతో పాటు భారత ప్రధాన నగరాలలోని హోటళ్లలో కూడా బిగ్ స్ర్కీన్ ఏర్పాటు చేసి మ్యాచ్ చూస్తున్నందువల్ల హోటళ్లు, లాడ్జీలు నిండిపోయాయి. ఇక మొహాలీ స్టేడియం శత్రు దుర్బేధ్యంగా మారింది. అక్కడ గగనతల నిషేధం విధించారు. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్‌లు అందుబాటులో ఉంచారు. ఇక మధ్యప్రదేశ్‌లో అయితే అసెంబ్లీని మధ్యాహ్నం వరకే కుదించారు.