మైనర్ల ప్రేమ.. మరణానికి దారి..
posted on Jun 12, 2021 @ 9:55AM
తెలంగాణాలో ఒక జానపదం పాట ఉంది.. అదే ఈ పాట.. ఆనాడు ఏ ఇంట పెళ్లి జరిగిన గానీ గౌరవంగా మస్తు గమ్మతుగుండేది.. తల్లిదండ్రి పెళ్లి సంబంధము చూస్తే..సచినట్టు మెచ్చి సంబర పడుదురు.. ఇవేమి రోజులో పాడు బీడుగాను.. సినిమాల సిత్రమో చదువు విచిత్రమో.. పట్టుమని పదేండ్లు నిండి ఉండవ్ వాడు.. లాగు తొడిగాడు వాడు లవ్వని అంటాడు.. అని ఒక రచయిత తన పాటలో చాలా చక్కగా చెప్పడు.. మన దురదృష్టవశాత్తు ఆ అలాంటి పిల్లలను మనం చూస్తేనే.. తాజాగా ఇద్దరు మైనర్లు ప్రేమించుకుని చివరికి ప్రాణాలు తీసుకున్నారు..
ఇంకా వాళ్ళకి జీవితమంటే ఏంటో తెలియదు.. సినిమాలు, పెరిగిన వాతావరణం, చేసిన సావాసమో తెలియదు గానీ ఏమి తెలియని వయసులోనే ఒకరితో ఒకరు ఆకర్షణలో పడిపోయారు. అదే ప్రేమనుకున్నారు.. జీవితం అనుకున్నారు.. ఏం జరుగుతుందో తెలిసేలోగానే ప్రేమ అనే పద్మ వ్యూహం లో చిక్కుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలీదు గానీ కలిసి చనిపోవాలనుకున్నారు. ఇద్దరూ కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వీరిలో బాలిక మృతి చెందగా, బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా
అది కర్నూల్ జిల్లా. అవుకు మండలం. రామాపురం గ్రామానికి చెందిన బాలిక (13), బాలుడు (16) గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వారిమధ్య ఏం జరిగిందో తెలియదు గానీచనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి బాలుడి ఇంటికి వెళ్లి ముందుగా ఫ్యానుకు ఉరేసుకున్నారు. కొక్కెం సరిగా లేని కారణంగా ఫ్యాను ఊడి కింద పడిపోయింది. దీంతో వారు మరో ప్రయత్నంగా పురుగుల మందు తాగారు. పనులకు వెళ్లి తిరిగొచ్చిన పెద్దలు వీరిని చూసి షాక్‌కు గురయ్యారు. బాలిక అప్పటికే చనిపోగా.. కొన ప్రాణాలతో ఉన్న బాలుడిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లి వైద్యశాలకు తరలించారు.
ఎప్పుడైతే ఇంటర్ నెట్ ఇంట్లోకి వచ్చిందో.. అదే మన కొంప ముంచింది.. ప్రముఖ గాయకుడూ గద్దర్ కూడా ఎప్పుడో ఒక పాట రాశాడు.. కయ్యం పెట్టిందో కలర్ టీవీ ఇంట్లకోచి.. ఇప్పుడు అదే జరుగుతుంది..ఇంకా రాను రాను ఎలాంటి పరిమాణాలు చూడాల్సి వస్తుందో.. ఏదేమైనా పిల్లలు ఉన్న తల్లి దండ్రులు వాళ్ళని ఓ కంట కనిపెట్టండి.. మనం ఉన్న ఈ బిజీ లైఫ్ లో వాళ్లకి కొంత టైం కేటాయించండి.. వాళ్ళ ఆందోళనను అర్థం చేసుకోండి..