పెయిడ్ పాదయాత్ర.. జస్ట్ ఇంటర్వెల్.. అమరావతిపై మంత్రి పెద్దిరెడ్డి ట్విస్ట్..
posted on Nov 22, 2021 @ 12:38PM
అమరావతి, మూడు రాజధానులపై జగన్‌రెడ్డి సర్కారు మైండ్‌గేమ్ ఆడుతోందా? కావాలనే ప్రజలను కన్ఫూజ్ చేస్తున్నారా? మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టులో అడ్వకేట్ జనరల్ చెప్పారు. కేబినెట్ భేటీలోనూ చర్చించారు. అసెంబ్లీలో జగన్ ప్రకటన చేస్తారని అంటున్నారు. కానీ, మంత్రులు మాత్రం డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు. టెక్నికల్ ఇష్యూస్ వల్లే మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్టు మంత్రి కొడాలి నాని చెప్పగా.. ఇది జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే.. ఇంకా సినిమా చాలా ఉందంటూ మరోమంత్రి పెద్దిరెడ్డి కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. రైతుల పాదయాత్రను పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర అంటూ నోరుపారేసుకున్నారు మంత్రి పెద్దిరెడ్డి. బిల్లు ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదన్నారు. రైతుల పాదయాత్ర చూసి చట్టం విత్‌డ్రా చేసుకోలేదంటూ మళ్లీ కలకలం రేపారు.
దీంతో, అసలు ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంటో అర్థం కాకుండా ఉంది. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచుతారా? లేక, బిల్లును వెనక్కి తీసుకొని.. మరో కొత్త బిల్లు తీసుకొచ్చి.. ఇష్యూ కంటిన్యూ చేస్తారా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. జగన్‌రెడ్డిని అంత ఈజీగా నమ్మలేమంటున్నారు.
మూడు రాజధానుల ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన ఇలా ఉంది..
--చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమే
--శుభం కార్డుకు మరింత సమయం ఉంది
--సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్
--నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నా
--ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదు
--అమరావతి రైతుల పాదయాత్ర లక్షలమందితో సాగుతోందా?
--అమరావతి రైతుల పాదయాత్ర.. పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర
--రైతుల పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదు
--జస్ట్ ఇంటర్ వెల్.. సినిమా చాలా ఉంది..
‘ రాజధాని విషయంలో ఇది ఇంట్రవెల్ మాత్రమే.. సినిమా ఇంకా పూర్తికాలేదు. రాజధాని రైతులు, టీడీపీ వేరు కాదు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రను టీడీపీనే చేయిస్తోంది. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను కేబినెట్ భేటీలో పాల్గొనలేదు. కాబట్టి పూర్తి వివరాలు తెలియవు. న్యాయపరమైన చిక్కుల వల్లే ఈ పరిస్థితి ఉండొచ్చు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం’ అని పెద్దిరెడ్డి కామెంట్స్ చేశారు. కాగా.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా స్పందిస్తుంటే.. టీడీపీ నేతలు, అమరావతి జేఏసీ నేతలు మాత్రం ఇదంతా తమ విజయమే.. ప్రభుత్వం ఇక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.