మూడు చట్టాల దారిలో మూడు రాజధానులు.. అమరావతి ఒకటే ఏపీ రాజధాని
posted on Nov 22, 2021 @ 12:19PM
చివరకు ధర్మమే జయిస్తుంది.. ధర్మో రక్షిత్ రక్షితః.. సూక్తి చెప్పే సత్యం ఇదే. మన కళ్ళ ముందు కదులుతున్న రైతుల విజయం నిరుపిస్తున్ననిజం అదే. కొద్ది రోజుల క్రితం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంవత్సర కాలంగా ఢిల్లీలో రైతులు చేస్తున్నధర్మ పోరాటానికి తలొగ్గారు. రైతుల డిమాండ్’ను అంగీకరించారు. రైతులు కోరిన విధంగా వివదాస్పద సాగు చట్టాలు మూడింటినీ రద్దుచేస్తామని ప్రకటించారు. అదే తరహాలో, అంతకంటే ఉదృతంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజదానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా సుమారు 700 రోజులకు పైగా, రైతులు చేస్తున్న ఆందోళనకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రబ్భుత్వం తలొగ్గింది. ఇది భారతీయ రైతులు సాధించిన రెండవ వరస విజయం అనవచ్చును.
రైతులు అన్దోఅలన చేసిన, 22 రోజులుగా పాదయత్ర కొనసాగుతున్న మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదిలేదని భీష్మించుకు కూర్చున్న జగన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల ఇందుకు సంబంధించిన చట్టాలను ఉపసంహకరించుకున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ విషయాన్ని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్‌కు తెలిపారు. రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ ఈ విషయం నివేదించారు.
నిజానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు చట్టాల రద్దు నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఉహించలేదు. కానీ, రైతుల సంకల్పం ముందు ప్రధాని మొండి పట్టు నిలలేదు. అలాగే, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో 700 రోజులకు పైగా రాజదాని రైతులు ముఖ్యంగా మహిళలు ప్రక్రుతి వైపరీత్యాలను, కొవిడ్ మహమ్మారిని ఎదుర్కుని సాగించిన పోరాటానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తలోగ్గుతారని, ఇలా హటాత్తుగా నిర్ణయం తీసుకుంటారని భావిచలేదు. కానీ, అమరావతినే ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర ‘మహాపాదయాత్ర’ 22వ రోజుకు చేరిన సందర్భంలో మూడు రాజధానులు, సీఆర్డఏ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకే ఇది రైతులు విజయం..ముఖ్యంగా మహిళల విజయంగా భావిస్తున్నారు.