ఇక పై చికెన్, మటన్ లకు.. క్యూలు అవసరం లేదు..
posted on Jun 16, 2021 9:13AM
తెలంగాణ లో ముక్క సుక్క చాలా ప్రాధాన్యత ఇస్తారు. పాదుగొచ్చిన, పబ్బం వొచ్చిన.. పుట్టున, సచ్చినా. పురుడుపోసిన, పెళ్లి జరిగిన, రథం చేసిన ఏం చేసిన ముక్క లేనిదే ముద్దాదిగడనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఆదివారం వస్తే చాలు చికెన్, మటన్ కోసం దుకాణాల ముందు జనం చిరంజీవి సినిమా టికెట్ కోసం క్యూ కట్టినట్లు క్యూ కడుతారు. మాములు టైములో అయితే ఒక కానీ కరోనా టైం లో కూడా మటన్ చికెన్ దుకాణానికాణాల ముందు క్యూ లు తగ్గడం లేదు. సోషల్ డిస్టెన్స్ లేదు ఈ మధ్య విజయవాడలో కరోనా నిబంధనలు పాటించకుండా ఈ దుకాలనాల ముందు ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారని మటన్, చికెన్ షాపులు క్లోజ్ చేశారు. అయితే తెలంగాణాలో తాజాగా మటన్ షాప్ ముందు చికెన్ షాప్ ముందు క్యూ కట్టాల్సిన అవసరంలేదని తెలిచేసింది.. మరి ఎలా అనుకుంటున్నారా..? కంగారు ఎందుకు క్లారిటీ కింది ప్యారాలో ఉంది చదవండి.
ఇక ఆది,మంగళ, బుధ వారాల్లో ఆ షాపుల ముందు భారీ క్యూలైన్లు ఉండదు. ఆ క్యూ లో నిలబడి మన టైం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సమస్య నుంచి గ్రేటర్ ప్రజలకు విముక్తి కలుగనుంది. ఇక మాంసం కూడా మీ ఇంటి వద్దకే వస్తోంది. నగరంలో మినీ స్లాటర్‌హౌజ్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో మినీ స్లాటర్‌హౌజ్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇవి పూర్తిస్థాయిలో ఏర్పాటు అయితే ఇక మాంసం దుకాణాల ముందు పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. మన ఇంటి వద్దకే మాంసం కూడా వచ్చేస్తోంది.
బోడుప్పల్ చెంగిచర్లలోని జాతీయ మాంస పరిశోధనా సంస్థ (ఎన్‌ఆర్‌సీఎం) శాస్త్రవేత్తలు మినీ స్లాటర్ హౌజ్‌ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. మంగళవారం చెంగిచర్లలోని ఎన్‌ఆర్‌సీఎంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో శాస్త్రవేత్తలు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ గిరీష్‌పాటిల్ వివరాలు వెల్లడించారు. మినీ స్లాటర్ హౌజ్‌లో తక్కువ వ్యవధిలోనే 10 వరకు గొర్రెలు, మేకలను వధించొచ్చు.
అంతేకాకుండా జంతు వధ ద్వారా వచ్చే వ్యర్థాలను గోబర్‌గ్యాస్‌గా ఉపయోగించుకొనేందుకు వీలుగా ఓ కంటైనర్‌ను పొందుపర్చారు. సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చయ్యే వీటి ఏర్పాటుకు నాబార్డు నుంచి రుణ సదుపాయం కల్పించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు ప్రతిపాదనలు పంపినట్లు వారు పేర్కొన్నారు.
ఇప్పటికే ఉప్పు దగ్గరి నుండి పడుకునే బెడ్ వరకు అన్ని ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. ఇంకా మందు ఒక్కటి ఆన్లైన్ లో దొరికితే సరిపోతుంది.. ఆ కొంచం కూడా బయటికి రాకుండా.. తిని ఇంట్లోనే పడుకొని ఎంచక్కా పొట్టలు పెంచుకుని లేని పోనీ రోగాలు తెచ్చుకుని మళ్ళీ దావఖానాలకు పరిగెత్తాలి.. అదే మనకు కావాల్సిందే.. చివరికి అదే జరిగేది..