కాంగ్రెసుతో ఇక చేలగాటమే: మజ్లిస్
posted on Jan 11, 2013 @ 8:06PM
నిన్న మొన్నటి వరకు పాతబస్తీ పార్టీగా మిగిలిపోయిన మజ్లిస్ పార్టీ అక్బరుద్దీన్ వ్యవహారంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పాపులర్ అయిపోయింది. కాంగ్రేసుకు తోకపార్టీగా ఉండే మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్ నే ఆడిస్తానంటోంది. ఇంతవరకు ఆపార్టీ ఉనికిని కూడా గుర్తించని ప్రజలు ఇప్పుడు ఆపార్టీ ఏమి మాట్లాడుతుందో, ఏమి చేస్తోందో అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ విషయాన్నీ మజ్లిస్ పార్టీకూడా బాగానే గుర్తించింది. తమ్ముడు జైలుకి వెళ్తేవెళ్ళేడు గానీ పార్టీ పాతిక ఏళ్ళు కష్టపడినా సంపాదించలేని పేరు పాపులారిటీనీ రాత్రికే రాత్రే సంపాదించిపెట్టేడని సంతోషపడుతోంది. ఇదే ఊపులో రాష్ట్రం మొత్తం తన పార్టీక్యాడర్ను మెరుగు పరుచుకొని వచ్చే ఎన్నికలలో మరో పది సీట్లయినా అదనంగా గెలుచుకొని నిర్ణాయాత్మక శక్తిగా ఎదగాలని భావిస్తోంది.
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం ఒక ప్రైవేట్ టీవీ న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వులో అక్బర్ కేసు గురించి, తదనంత పరిణామాల గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు.
“నిజం చెప్పాలంటే నా మాట నా తమ్ముడు అక్బర్ మాట వేరు కాదు. ఇద్దరిదీ ఒక్కటే మాట. అతనిపై ప్రభుత్వము చేస్తున్న కుట్రని మేము కోర్టుల్లో సమర్దంగా ఎదుర్కొంటాము. హైకోర్టు ఇటీవల మాపై చేసిన విమర్శలు దాని వ్యక్తిగతమే తప్ప తీర్పులో భాగంగా చూడరాదు. అందరూ భావిస్తున్నట్లు మమ్మల్ని ఏ హిందువూ వ్యతిరేకించట్లేదు. కేవలం బీజేపీ, సంఘ్ పరివార్ మాత్రమే, ఈ అంశాన్ని అవకాశంగా తీసుకొని మా పార్టీపై యుద్ధం ప్రకటించాయి. రాష్ట్రంలో రాజకీయంగా ఉనికి కోల్పోతున్నందునే బీజేపీ ఈవిదంగా రాజకీయం చేస్తోంది. అయినా వాటిని చూసి మేము భయపడము. మా పార్టీ ఏ మతానికి, కులానికి, ప్రాంతానికి గానీ వ్యతిరేఖం కాదు. వచ్చే ఎన్నికలలో అణగారిన వర్గాలవారినందరినీ ఏకత్రాటిపైకి తెచ్చి ప్రభుత్వంలో మాభాగం పొందేందుకు తప్పక ప్రయత్నిస్తాము. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కిరణ్ కుమార్ రెడ్డే అధికారంలో కొనసాగినప్పుడే ఎన్నికలలో అతనితో చెలగాటం ఆడుకోవడంలో మాకు ఆనందం కలుగుతుంది."
"తెరాస మిలియన్ మార్చ్ సందర్బంగా ట్యాంక్ బ్యాండ్ మీద ఉన్న విగ్రహాలను ఆ పార్టీ కార్యకర్తలు ద్వంసం చేస్తే కేసులు పెట్టడానికి దైర్యం లేని ప్రభుత్వం, మరిప్పుడు మాపై కేసులు పెట్టడానికి ఎవరిని చూసుకొని అంట దైర్యం వచ్చిందంటే బీజేపీ వల్లనే అంటాము. అదే విదంగా బాబ్రీ మసీదు కూల్చినవారిపై కేసులు పెట్టని కాంగ్రెస్ ప్రభుత్వం మా పార్టీని ఎందుకు లక్ష్యం చేసుకొంటోందిప్పుడు? ఆ రెండు పార్టీలు కుమ్మకయి మా పార్టీపై తప్పుడు కేసులు వేసి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నాయి. అయితే, మా తడాఖా ఏమిటో వచ్చే ఎన్నికలలో తప్పక చూపిస్తాము.”