డాక్యుమెంటరీ సినిమాలో నటించిన చంద్రబాబు

 

ఖమ్మం జిల్లాలో పాద యాత్ర చేస్తున్న చంద్రబాబు ఈ రోజు నటుడిగా మారి రాజకీయాలకి అతీతంగా దేశఅభివృద్ది’ అనే అంశంతో మణిశంకర్ నిర్మిస్తున్న డాక్యుమెంటరీ సినిమాలో మూడు నిమిషాలు నటించేరు. దానికోసం అయన దాదాపు అరగంట ప్రాక్టీసు కూడా చేసారు. షూటింగ్ తరువాత దర్శకుడు మణిశంకర్ మాట్లాడుతూ ఈ సినిమాకోసం చంద్రబాబు చాల బాగా సహకరించేరని చెప్పారు. ఈ డాక్యుమెంటరీ రాజకీయలకి అతీతంగా దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్న వ్యక్తుల గురించి తెలియజేసేదని చెప్పారు. ఈ డాక్యుమెంటరీ ఎవరినీ పొగడడానికి కానీ, ఎవరినీ విమర్శించడానికి గానీ ఉద్దేశించినది కాదని తెలిపారు.

Teluguone gnews banner