సౌదీ కన్నా తక్కువ భారత్ రక్షణ బడ్జెట్
posted on Sep 2, 2020 @ 8:00PM
ప్రపంచంలోని అనేక దేశాలు తమ రక్షణ బడ్జెట్ ను ఏటేటా పెంచుతున్నాయి. జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్ల రూపాయలను రక్షణారంగానికి కేటాయిస్తున్నాయి. భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఏయే దేశాలు రక్షణవ్యవస్థ కోసం ఎంత బడ్జెట్ ను కేటాయిస్తున్నాయో పరిశీలిస్తే సౌదీ అరేబియా కన్నా భారత దేశం తక్కువ బడ్జెట్ ను రక్షణా రంగానికి కేటాయిస్తోంది.
ప్రపంచ మొత్తం సైనిక వ్యయం 2018 లో సుమారు 8 1.8 ట్రిలియన్లు. ఇది 2017 బడ్జెట్ కన్నా 2.6శాతం అధికం. ప్రపంచంలో అత్యధిక రక్షణ వ్యయం ఉన్న పది దేశాలు రక్షణా రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ వివరాలు పరిశీలిస్తే ఆయా దేశాలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో తెలుస్తోంది.
యునైటెడ్ స్టేట్స్ అమెరికా రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఏటా బడ్జెట్ లో కేటాయింపులు పెంచుతోంది. సైనికుల జీతభత్యాలతో పాటు పరిశోధనలకు కూడా ఇందులో కేటాయింపులు ఉంటాయి. అమెరికా రక్షణ వ్యయం 649 బిలియన్ డాలర్లు
చైనా
ప్రపంచంలో అధిక జనాభా ఉన్న చైనా రక్షణ రంగానికి భారీగానే కేటాయింపులు చేస్తోంది. ప్రతి ఏటా 250 బిలియన్ డాలర్లకు మించి రక్షణ శాఖకు కేటాయింపులు చేస్తోంది.
సౌదీ అరేబియా
ఈ దేశ జనాభా సుమారు 34,813,871. అయితే రక్షణ రంగానికి కేటాయింపులు మాత్రం 67. 6 బిలియన్ డాలర్లు. అంటే ఆ దేశ జిడిపిలో 8.8శాతం.
భారత్
భారతదేశంలో రక్షణా వ్యయం 66.5 బిలియన్ డాలర్లు. అంటే జిడిపిలో 2.4శాతం మాత్రమే. సౌదీ అరేబియా కేటాయించిన దాని కంటే ఇది తక్కువ.
ఇరత దేశాలు
ఇక ఇతర దేశాల రక్షణా బడ్జెట్ ను పరిశీలిస్తే
ఫ్రాన్స్ 63.8 బిలియన్ డాలర్లు, రష్యా 61.4 బిలియన్ డాలర్లు, యునైటెడ్ కింగ్‌డమ్ 50 బిలియన్ డాలర్లు, జర్మనీ 49.5 బిలియన్ డాలర్లు, జపాన్ 46.6 బిలియన్ డాలర్లు, దక్షిణ కొరియా 43.1 బిలియన్ డాలర్లు.