ఆడవాళ్లు మీకు జోహార్లు.. వధువును హెలికాప్టర్లో తీసుకెళ్లిన వరుడు..
posted on Jul 22, 2021 @ 12:09PM
ఒకప్పుడు మన దేశం మాతృస్వామిక దేశం.. అది రాను రాను పితృసామిక దేశంగా అవతరిండిచి. గతంలో ఆడవాళ్లను చాలా గౌరవంగా చూసుకునే సంప్రదాయం మనది.. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన మహిళలపై నిత్యం దాడులతో వెలుగొందుతున్న దేశం గా మారింది.. ఎంత లా అంటే.? తల్లిదండ్రులు ఆడపిల్లలని కనాలంటే ఆలోచించేంతలా.. తన కడుపులో ఆడపిల్ల ఉందంటే గర్భంలోనే చంపేసెంతలా తయారు అయింది. ఎందుకంటే ఆడవాళ్లకు ఈ సమాజంలో రక్షణ లేకపోవడం అందుకు ఒక కారణం అయితే.. ఆ ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే వరకట్నం సమస్య మరొకటి.. కానీ తాజాగా ఒక వ్యక్తి పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. అంతేగాక.. మహిళలకు గౌరవం ఇస్తూ ఆమెను మహరాణిలా హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకెళ్లాడు. ఆడపిల్లను అంతా తక్కువగా చూస్తారు. అయితే, అతడు మాత్రం అలా కాదు. తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అతడు ఓ యువతిని పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. ఆమెను హెలికాప్టర్‌లో మహరాణిలా ఇంటికి తీసుకొచ్చాడు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
పానీపట్‌కు చెందిన మాజీ కౌన్సిలర్ రామ్ కుమార్ సైనీకి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇద్దరు కొడుకులకు కట్నం తీసుకోకుండానే పెళ్లి చేశాడు. మూడో కుమారుడు మనీష్ సైనీకి సైతం కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. తన కొడుకులకు కట్నం తీసుకోకూడదనే అతడి భార్య రమ్‌కాలీ కోరికను వారు సాంప్రదాయంలా పాటిస్తున్నారు. ఇటీవల రామ్ కుమార్.. అతడి మూడో కొడుకు మనీష్ సైనికి జింద్‌లోని నర్వానాకు చెందిన మోనికా సైనీతో పెళ్లి చేశాడు.ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు అందరు సమాజం లో ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజంగా వాళ్ళ కుటుంబానికి సెల్యూట్ చెయ్యాలి.
ఆడబిడ్డ గొప్పతనం తెలిపేందుకు తన చిన్న కోడలిని హెలికాప్టర్‌లో తీసుకురావాలని రామ్‌కాలీ కొడుకును కోరింది.తండ్రి మాటను జవదాటని రాముడిలా అతడు మోనికాను హెలికాప్టర్‌లో తన ఇంటికి తీసుకొచ్చాడు. తమ కుటుంబంలో ఆడ, మగా అనే తేడా ఉండదని, అందరినీ సమానంగా చూస్తామని సైనీ కుటుంబికులు తెలిపారు. తల్లి కోరిక మేరకు సైనీ ఢిల్లీలో హెలికాప్టర్లను అద్దెకు ఇచ్చే ఓ సంస్థను సంప్రదించాడు. వధువరులిద్దరూ హెలికాప్టర్ నుంచి ఠీవిగా దిగడాన్ని చూసి ప్రజలు సైతం మురిసిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన హర్యానా లో జరిగింది..
తాజాగా కేరళ రాష్ట్రము లో వరకట్న నిషేధ చట్టాన్ని మారిందా పకడ్బందీగా రూపొందించడానికి చర్యలు తీసుకుంటుంది.. అలాగే మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచిస్తే తల్లి గర్భం లో చనిపోయే ఆడవాళ్లు కనీసం ఈ ప్రపంచాన్ని చూస్తారు.. ఆడపిల్లలు పుట్టనిద్దాం.. చదవనిద్దాం అనే నినాదం అందరు అమలు చేస్తే ఈ దేశ ప్రగతి ముందుకు వెళుతుంది.. ఆడామగా తేడాలేని సమాజం కోసం అందరు కృషి చెయ్యాలి..