ఆమెకి మగాడి అవసరం లేదట!
posted on Apr 1, 2014 @ 6:00PM
సినిమాల్లో తన ఎరోటిక్ యాక్టింగ్‌తో మగాళ్ళని పిచ్చోళ్ళని చేసిపారేసిన ఆ హీరోయిన్ ఇప్పుడు తనకి మగాళ్ళ అవసరే లేదని స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు... ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ షరాన్ స్టోన్. ‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’ సినిమాలో కాలుమీద కాలు వేసుకుని పోలీస్ ఇంటరాగేషన్‌లో పాల్గొనే సీన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సష్టించిన షరోన్ స్టోన్ వయసు పెరిగినా ఇప్పటికీ తాను హాట్ హీరోయిన్ అనే భావిస్తూ వుంటుంది.
ఇప్పటికీ ఆమె నటిస్తున్న సినిమాల్లో ‘అలాంటి’ సీన్లు కోకొల్లలు వుంటాయి. లేటెస్ట్ గా షరోన్ స్టోన్ ఒక సంచలనాత్మక ఇంటర్వ్యూ ఇచ్చేసింది. తనకి ఇప్పుడు మగాడి అవసరమే లేదట. మగాడి అవసరం లేకుండానే తాను జీవించగలదట. మగాడితో కలసి వుండటం తనకిప్పుడు చాలా చిరాకు తెప్పించే విషయమట. ఒంటరిగా వుండటం అనేది తనకి ఇప్పుడు చాలా సంతోషాన్ని కలిగించే అంశమట.
ఒకప్పుడు హాలీవుడ్ శృంగార దేవతగా పేరు తెచ్చుకున్న షరోన్ స్టోన్ ఇప్పుడు సడెన్‌గా తనకు మగాడి అవసరం లేదని ప్రకటించడం ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది మగాళ్ళను హర్ట్ చేసిందో లెక్కలేదు. ఇప్పుడు షరాన్ స్టోన్ వయసు 56 యేళ్ళు. ఈ వయసులో ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చింది కాబట్టి పెద్దగా ప్రమాదం జరగలేదు. ‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’ రోజుల్లో ఇచ్చి వున్నట్టయితే ఎన్ని మగ గుండెలు ఆగిపోయి వుండేవో. కెరీర్ ఫేడింగ్ దశలో వున్న ఈ బామ్మగారు ప్రస్తుతం ‘ఫేడింగ్ గెలేలో’ అనే హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో కూడా బోలెడన్ని సరసాత్మక సన్నివేశాల్లో షరోన్ స్టోన్ నటించిందని తెలుస్తోంది.