అలియా భట్ కిస్సు సూపరంట!
posted on Apr 1, 2014 @ 7:30PM
మహేష్ భట్ తనయ, బాలీవుడ్ భామ అలియాభట్ ముద్దులు ఇవ్వడంలో బోలెడంత టాలెంటెడ్ గాళ్ అట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్. ఆ మాట ఎవరితో అన్నాడంటే సాక్షాతూ అలియా భట్‌తోనే అన్నాడు. ఈ కాంప్లిమెంట్‌ని అలియాభట్టే మీడియాకి చెప్పింది. ప్రస్తుతం అలియాభట్, అర్జున్ కపూర్ ‘2 స్టేట్స్’ అనే సినిమాలో నటిస్తున్నారు. రిలీజ్‌కి రెడీ అయిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో వీళ్ళిద్దరూ పాల్గొంటున్నారు.
ముంబైలోని అనేక ప్రదేశాలలో ఈ జంట ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటోంది. ఈ కార్యక్రమాలలో క్లోజ్‌గా మూవ్ అవుతున్న వీళ్ళిద్దరినీ చూసి వీళ్ళిద్దరూ సినిమాలో హీరో హీరోయిన్లు మాత్రమేనా.. లేక ఇద్దరి మధ్య ఏదైనా కెమిస్ట్రీ నడుస్తోందా అన్న సందేహాలు చూసేవాళ్ళకి కలుగుతున్నాయట. చూడ ముచ్చటగా వున్న ఈ జంట అందరి మధ్య క్లోజ్‌గా మూవ్ అవుతూ వుంటే జనం గుండెల్లో గిలిగింతలు పుట్టకుండా వుంటాయా? ‘2 స్టేట్స్’ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య కిస్సింగ్ సీన్లు కూడా వున్నాయి.
అయినా మన అమాయకత్వం గానీ, ప్రస్తుతం బాలీవుడ్‌లో కిస్సింగ్ సీన్లు లేకుండా ఎవరూ సినిమాలు తీయడం లేదు కదా. కాకపోతే అలియా, అర్జున్ లాంటి జంట కిస్సు పెట్టుకుంటే ఆ జిల్‌జిల్లే వేరు. ‘2 స్టేట్స్’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈ జంట ఓచోటకి వెళ్ళినప్పుడు మీడియావాళ్ళు అలియాని మీలో అర్జున్ కపూర్’కి నచ్చిన అంశాలేంటని అడిగారట. దానికి అలియా ఆల్చిప్పల్లాంటి కళ్ళని టపటపలాడిస్తూ, ‘నేను ముద్దు బాగా పెడతానని అర్జున్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు’ అని చెప్పేసింది. అలియా భట్ చెప్పిన సమాధానం విని అక్కడ వున్నవాళ్ళందరూ ముసిముని నవ్వులు నవ్వుకున్నారట.