ఆ ‘ఎక్స్’పోజింగ్ అవసరమా?
posted on Apr 1, 2014 @ 5:07PM
సినిమాలో విద్యాబాలన్ ఎక్స్ పోజింగ్ చాలా ప్రత్యేకంగా వుంటుంది. మంచి పర్సనాల్టీ కావడంతో విద్యాబాలన్ ఎక్స్ పోజింగ్ చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. విద్యా ఎక్స్ పోజింగ్ లెవల్ గురించి చెప్పుకోవాలంటే ‘డర్టీ పిక్చర్’ శాంపిల్ చాలు. ‘డర్టీ పిక్చర్’ లాంటి సినిమాల ద్వారా విద్యాబాలన్ సినిమా రంగానికి చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెకు ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపిక చేసింది. సరే, ఈ విషయంలో బోలెడన్ని కాంట్రవర్సీలు వచ్చాయి. ‘పద్మశ్రీ’ పొందే అర్హత విద్యాకి ఎక్కడుందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
ఇవన్నీ ఇలా వుంటే, సోమవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యా బాలన్ కూడా పురస్కారాన్ని అందుకుంది. విద్యాబాలన్ చక్కని చీరకట్టుతో రావడాన్ని దూరం నుంచి చూసిన చాలామంది పోన్లే పాపం సంప్రదాయబద్ధంగా వచ్చిందని అనుకున్నారు. అయితే విద్యాబాలన్ దగ్గరికొచ్చాకగానీ, అమ్మడు చేసిన ఎక్స్ పోజింగ్ బయట పడలేదు. ఎక్కడ చూపించాలో అక్కడ, ఎంత చూపించాలో అంత చూపిస్తూ విద్యాబాలన్ చేసిన ఎక్స్ పోజింగ్ అక్కడ వున్నవారి కళ్ళు చెదిరిపోయేలా చేసిందట.
ఇతర సందర్భాల్లో ఈ ఎక్స్ పోజింగ్ ఓ పద్ధతిగా వుండేదిగానీ, దేశ ప్రథమ పౌరుడి దగ్గరకి, దేశంలో ఉన్నత అవార్డును అందుకోవడానికి వచ్చి ‘అలా’ ఎక్స్ పోజింగ్ చేయడం న్యాయం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవసరం లేని చోట ఎక్స్ పోజింగ్ చేయడం అవసరమా అని కామెంట్లు వినిపించాయి.