నటిఫై అసభ్య పవర్తన, జర్నలిస్ట్ మృతి

 

 

 

మణిపూర్ లో ఓ సినీనటి ఫై నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ తీవ్రవాది అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనఫై ఈశాన్య భారతం బగ్గుమంటోంది. చందేల్ టౌన్ లో ఏర్పాటు చేసిన విరాళాల కార్యక్రమంలో సినీ నటి మోమోకో పాల్గొంది.

 

ఈ కార్యక్రమంలో అందరూ చూస్తుండగానే ఆ తీవ్రవాది ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే, అక్కడ ఉన్న వ్యక్తులతో పాటు, పోలీసులు గానీ, అస్సాం రైఫిల్స్ సిబ్బంది గానీ ఏమాత్రం స్పందించలేదు. దీనితో ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేసే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని, నిరసనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించిన మణిపూర్ చిత్ర పరిశ్రమ బంద్ కు పిలుపు ఇచ్చింది.

 

మరో వైపు పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చి, ఈ సంఘటనఫై తమ నిరసనను తెలుపుతున్నారు. దీనితో, అక్కడ పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఓ దశలో ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనలను కవర్ చేయడానికి వచ్చిన ప్రైమ్ న్యూస్ విలేఖరి ననావో సింగ్ చాతీ లోకి బుల్లెట్ దూసుకుపోవడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. దీనితో ఇంఫాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

ఈ అంశంఫై చర్చించడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి ఇబోబి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తో సమావేశమయ్యారు. ఆ తీవ్రవాదిని పట్టుకుంటామని, నిరసన ప్రదర్శనలను ఆపాలని మణిపూర్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Teluguone gnews banner