కోడలిని రూ. 80 వేలకు బేరం పెట్టిన మామ
posted on Jun 8, 2021 @ 11:03AM
ఒక వైపు అడ్డవాళ్లకు సమాన హక్కులు కల్పించాలని. చట్ట సభల్లో అదే ఆడవాళ్లకు వారి జనాభా తరుపున రిజర్వేషన్ అవకాశం కల్పించాలని. ఆడవాళ్లను నింగిలో సగం నెలలో సగం అంటూ కవులు రాస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న సమాజంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో మగవాళ్ళతో సమానంగా పనిచేస్తున్నారు. నేటి సమాజంలో లో మహిళలపై ఉన్న ఓ కోణం ఇది అయితే.. ఆడవాళ్లు అంటే వంటింటి బానిసలే.. మగాడి చెప్పుచేతుల్లో మగ్గాల్సిందే అనేది మరో కోణం అయితే.. ఈ సమాజంలో మరో చీకటి కోణం కూడా ఉంది ఆడవాళ్లు అంటే మగాడి కోరికలు తీర్చే వస్తువుగా మాత్రమే కొంత మంది చూస్తారు. తాజాగా ఒక మహిళను సూపర్ మార్కెట్ లో సరుకు అమ్మినట్లు అమ్మనలేకున్నాడు ఒక దుర్మార్గుడు.. ఆడవాళ్లను అమ్మడం ఏంటి అమ్మడానికి ఆవిడ ఏమైనా అంగట్లో ఉల్లిపాయనా, ఉసిరికాయనా అని అనుకుంటున్నారా మీరే చుడండి అసలు ఏం జరిగిందో..
అతని పేరు చంద్ర రామ్. కొన్నీ రోజులుగా అతనికి కోడలిని ఒక ముఠాకి అమ్మాలని పధకం వేశాడు. అందుకు అన్ని ఒప్పందాలు చేసుకున్నాడు. రూ. 80 వేలకు విక్రయించాలని ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తీగలాగితే డొంక అంత బయట పడేట్లు ఈ ఒక విషయం తో మిగతా మొత్తం ముఠా దొరికింది. వివరాల ప్రకారం.. యూపీలోని బారాబంకీ జిల్లాలో మల్లాపూర్‌కు చెందిన చంద్రరామ్ అనే వ్యక్తి గుజరాత్‌కు చెందిన ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని తన కోడలిని రూ. 80 వేలకు విక్రయించాడు.
ఈ విషయం కాస్త మహిళ భర్తకు తెలియడంతో.. బాధితురాలి భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అప్రమత్తమైన పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని బాధితురాలిని కాపాడారు. అనంతరం 8 మంది ఉన్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ముఠా ఇప్పటి వరకు 300 మంది మహిళలను ఇలా కొనుగోలు చేసినట్టు పోలీసులకు తెలియడంతో వారు ఒక్కసారిగా షాకయ్యారు. పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ముఠాలో ప్రధాన నిందితుడు బాధితురాలి మామ చంద్రరామ్ ప్రస్తుతం పరారీలో ఉండగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.